పోస్ట్‌లు

మే, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Mahesh Babu - Superstar Krishna విజయనిర్మలని రెండో వివాహం చేసుకున్నా మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిర దేవి కృష్ణ ని వదిలిపెట్టలేదు ఎందుకంటే ?

చిత్రం
సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మలని రెండో వివాహం చేసుకున్నా మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిర దేవి కృష్ణ ని వదిలిపెట్టలేదు ఎందుకంటే ???? మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కృష్ణ రెండో భార్య విజయనిర్మల ఎంతో సఖ్యత గా ఉండేవారు !!!  సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరా దేవి కృష్ణ కి స్వయంగా మరదలు అంటే కృష్ణ మేనమామ కూతురు ఇందిరా దేవి. ఏలూరులోని సి ఆర్ ఆర్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక తన మరదలైన ఇందిరా దేవిని నవంబర్ 1,1962లో వివాహం చేసుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ కెరీర్ తొలి రోజుల్లో ఇందిరాదేవి చాలా మోరల్ సపోర్ట్ చేసేది. అదే సమయంలో అంటే మార్చ్1965 లో కృష్ణ, ఇందిరా దేవి లకు తమ మొదటి సంతానమైన రమేష్ బాబు జన్మించాడు. అదే సమయంలో అంటే 31 march,1965 లో కృష్ణ నటించిన మొట్టమొదటి సినిమా అయిన తేనె మనసులు రిలీజ్ అయింది. తేనె మనసులు సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాకుండా కృష్ణని సూపర్ స్టార్ ని చేసింది. ఆ తర్వాత గూడచారి 116, మోసగాళ్లకు మోసగాడు, ఏజెంట్ గోపి,అల్లూరి సీతారామరాజు లాంటి సూపర్ హిట్ మూవీస్ లో యాక్ట్ చేశారు కృష్ణ గారు.ఆ తర్వాత కృష్ణ, ఇందిరా దేవి లకు 1969 లో పద్మావతి అనే కూత

Telugu - Tollywood Singers Divorce Latest Updates

చిత్రం
మన ఫిల్మ్ ఇండస్ట్రీలో  ఎంత మంది  ప్లేబ్యాక్ సింగర్స్ విడాకులు తీసుకుని విడిపోయారో తెలుసా!!! ఫిలిం ఇండస్ట్రీలో వివాహం చేసుకోవడం విడిపోవడం చాలా సర్వసాధారణమైన విషయం. అయితే కొంత మంది విడిపోతే మరి కొంతమంది మాత్రం కడదాకా కలిసే ఉంటారు.  కొంచెం పాపులారిటీ రాగానే ప్రేమ పెళ్లి  అంటూ వివాహాలు చేసుకుంటూ ఉంటారు కానీ ఆ వివాహాలు అతి త్వరలోనే విడాకులకు దారి తీస్తున్నాయి. అలా విడాకులు తీసుకుని విడిపోయిన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. S.P.చరణ్  : ప్రముఖ సింగర్ ఎస్ పి చరణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎస్పీ చరణ్ 1998లో స్మిత అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఎస్పీ చరణ్ మొదటి భార్య  నుంచి 2002లో విడాకులు తీసుకున్నాడు. సింగర్    సునీత :  సింగర్ సునీత ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో పుట్టింది. సింగర్ సునీత కిరణ్ అనే  వ్యక్తిని ప్రేమించీ మరీ వివాహం చేసుకుంది. సింగర్ సునీత మొదటి భర్త కిరణ్ మీడియాలో పనిచేస్తాడు. SINGER1 సునీత తల్లిదండ్రులకి ఆ వివాహం ఇష్టం లేకపోవడంతో సునీత ఇంట్లోంచి పారిపోయి మరీ కిరణ్ ని ప్రేమ వివాహం

Tollywood Actress - జయప్రద నిజ జీవితంలో అంత దారుణంగా మోసపోయిందా ?? అందుకే భర్తకు విడాకులు ఇచ్చేసిందా ??

చిత్రం
అందమైన హీరోయిన్ జయప్రద నిజ జీవితంలో అంత దారుణంగా మోసపోయిందా ?? అందుకే భర్తకు విడాకులు ఇచ్చేసిందా ?? అందమైన హీరోయిన్ గా ఎంతో మంచి  పేరు తెచ్చుకున్న  జయప్రద నిజ జీవితంలో మాత్రం చాలా కష్టాలు  అనుభవించింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి పేరు,ప్రేక్షకాదరణ పొందింది జయప్రద. అలాంటి జయప్రద జీవితంలో మాత్రం చాలా దారుణంగా దెబ్బతింది. ఇన్కమ్ టాక్స్ రైడ్ :   కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు జయప్రద మీద ఇంకం టాక్స్ రైడ్ జరిగింది . దానివల్ల జయప్రద మానసికంగా చాలా బాధపడింది అంతే కాకుండా తన కెరీర్ కూడా దెబ్బతింది. ఆ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ నహతా బాసటగా నిలిచాడు. శ్రీకాంత్ నహతా జయప్రద నటించిన గిరిజా కళ్యాణం,సిరిపురం మొనగాడు వంటి సినిమాలను నిర్మించాడు. శ్రీకాంత్ నెహతా తో పరిచయం :  జయప్రద శ్రీకాంత్ నెహతా ల మధ్య అలా  పరిచయం ఏర్పడింది. కష్టకాలంలో ఆదుకున్న  శ్రీకాంత్ నహతా తో ప్రేమలో పడింది జయప్రద. అయితే అప్పటికే శ్రీకాంత్ నేహాతా కి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా జయప్రద శ్రీకాంత్ నేహాతా తో గుడ్డి ప్రేమలో పడిపోయింది,దానితో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళిద్ద

Mysterious Temples In India - భారతదేశంలోని కొన్ని అసాధారణ దేవాలయాలు

చిత్రం
Mysterious Temples In India - భారతదేశంలోని కొన్ని అసాధారణ దేవాలయాలు సాధారణంగా మనమంతా మనసు ప్రశాంతత పొందడానికి గుళ్ళు, గోపురాలు సందర్శిస్తూ ఉంటాము. కొంతమంది తమ చుట్టుపక్కల దగ్గరగా ఉన్న ఆలయాలను సందర్శించడానికి ఇష్టపడితే మరి కొంత మంది కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలను సందర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అలాంటి ఒక ప్రత్యేక దేవాలయం గురించి ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో జైపూర్ నుండి నూటమూడు కిలోమీటర్ల దూరంలో జైపూర్ ఆగ్రా హైవేపై ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయం ఒక అసాధారణ దేవాలయం. ఈ ఆలయాన్ని భక్తులు ఏడాది పొడుగునా అత్యధికంగా సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో హనుమంతున్ని బాలాజీ పేరుతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక ఈ ఆలయం ప్రత్యేకంగా దుష్ట శక్తుల అంటే చేతబడి, దెయ్యం పట్టడం మొదలైన వాటి బారిన పడిన వ్యక్తులకు నయం చేసే భూత వైద్యం యొక్క అద్భుతమైన శక్తులను కలిగి ఉంటుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని ముఖ్యంగా ఆంజనేయస్వామికి ఎంతో ఇష్టమైన రోజులుగా భావించే మంగళ మరియు శనివారాల్లో భక్తులు ఈ ఆల

Andhra Magaya Pachadi - Magaya Pickle

చిత్రం
Andhra Magaya Pachadi - Magaya Pickle  మాగాయ పచ్చడిని ఇలా కొలతలతో చేసి చూడండి ఏడాది పాటు తాజాగా ఉంటుంది ఎండాకాలం వచ్చేసింది కదా ఇప్పుడు మనకి మార్కెట్లో లేదా మన పెరట్లో దొరికే పుల్లటి మామిడికాయలతో ఇలా సరైన కొలతలతో మాగాయ పచ్చడి తయారు చేసి చూడండి మొదటిసారి తయారుచేసినా చాలా రుచికరంగా ఉండడమే కాకుండా ఏడాది పాటు తాజాగా నిల్వ ఉంటుంది. మాగాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్ధములు మామిడికాయ ముక్కలు - 2 కప్పులు  లేదా 6 మామిడికాయలు పసుపు - 2 టీ స్పూన్లు  ఉప్పు - 1/4 కప్పు కారం  - 1/2 కప్పు ఆవాలు - 4 టీ స్పూన్లు  నువ్వుల నూనె లేదా పల్లీ నూనె - 1 1/2 కప్పులు  మెంతులు - 2  టీ స్పూన్లు మాగాయ పచ్చడి తయారు చేసే విధానం ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి  తుడిచి ఆరబెట్టాలి. మామిడికాయలు తడి లేకుండా శుభ్రంగా ఆరాకా మామిడికాయ ముక్కల్ని 2 ఇంచుల ముక్కలుగా తరగాలి. 2.అలా ముక్కలన్నీ తరిగాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా ఏదైనా ఒక గిన్నెలో కానీ రెండు ఇంచుల సైజులో తరిగిన మామిడికాయ ముక్కలు, 1/4  కప్పు ఉప్పు మరియు రెండు టీ స్పూన్ల పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మూడు రోజులపాటు అలాగే వదిలేయాలి.

TS Inter Results | 9వ తేదీన విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

చిత్రం
TS Inter Results | 9వ తేదీన విడుదల కానున్న తెలం గాణ ఇంటర్ ఫలితాలు TS Inter Results | 9వ తేదీన విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇంటర్ విద్యార్థులందరూ ఎప్పటినుంచో ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఈ నెల 9వ తేదీన అంటే మంగళవారం నాడు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. TS Inter Results | Hyderabad : ఇంటర్ విద్యార్థులందరూ ఎప్పటినుంచో ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఈ నెల 9వ తేదీన అంటే మంగళవారం నాడు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్ ప్రధమ మరియు  ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు దాదాపు 9.4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరులో 4.8 లక్షల మంది మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా రెండో సంవత్సరం పరీక్షలకు గాను మొత్తం 4.6 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు మే 9వ తేదీన ఉదయం 11 గంటలకు నాంపల్లిల

Vanilla Ice Cream Recipe - Home Made Ice Cream Recipe

చిత్రం
Vanilla Ice Cream Recipe - Home Made Ice Cream Recipe . ప్రస్తుతం వేసవికాలం సెలవులు వల్ల పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు.  వేసవికాలం కావడం వలన ఎండలు కూడా విపరీతంగానే ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్నం పూట పిల్లలు, కేవలం పిల్లలు మాత్రమే కాదండోయ్ పెద్దవారు కూడా చల్ల చల్లగా తినడానికి ఇంట్లోనే సులభంగా ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వెనీలా ఐస్ క్రీమ్ ను తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం . బయట కొనే  ఐస్ క్రీమ్స్ లో  కెమికల్స్ ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే దొరికే వస్తువులతో సులభంగా, రుచికరంగా,ఆరోగ్యకరంగా వెనీలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పాలమీగడ - 1 కప్పు చిక్కని పాలు - 1 కప్పు వెనీలా ఎసెన్స్ - 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్ పంచదార పొడి - 1/2 కప్పు కొలతలకి గాను ఒకే గ్లాస్ ని కానీ కప్పుని కానీ  వాడండి. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం.ముందుగా స్టవ్ వెలిగించాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం లో పెట్టి స్టవ్  మీద ఒక మందపాటి గిన్నెను పెట్టి ఒక కప్పు పాలల్లోంచి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పాలని పక్కన పెట్టి మిగి