Mahesh Babu - Superstar Krishna విజయనిర్మలని రెండో వివాహం చేసుకున్నా మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిర దేవి కృష్ణ ని వదిలిపెట్టలేదు ఎందుకంటే ?

సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మలని రెండో వివాహం చేసుకున్నా మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిర దేవి కృష్ణ ని వదిలిపెట్టలేదు ఎందుకంటే ????


మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కృష్ణ రెండో భార్య విజయనిర్మల ఎంతో సఖ్యత గా ఉండేవారు !!! 
సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరా దేవి కృష్ణ కి స్వయంగా మరదలు అంటే కృష్ణ మేనమామ కూతురు ఇందిరా దేవి.

ఏలూరులోని సి ఆర్ ఆర్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక తన మరదలైన ఇందిరా దేవిని నవంబర్ 1,1962లో వివాహం చేసుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ కెరీర్ తొలి రోజుల్లో ఇందిరాదేవి చాలా మోరల్ సపోర్ట్ చేసేది. అదే సమయంలో అంటే మార్చ్1965 లో కృష్ణ, ఇందిరా దేవి లకు తమ మొదటి సంతానమైన రమేష్ బాబు జన్మించాడు. అదే సమయంలో అంటే 31 march,1965 లో కృష్ణ నటించిన మొట్టమొదటి సినిమా అయిన తేనె మనసులు రిలీజ్ అయింది. తేనె మనసులు సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాకుండా కృష్ణని సూపర్ స్టార్ ని చేసింది. ఆ తర్వాత గూడచారి 116, మోసగాళ్లకు మోసగాడు, ఏజెంట్ గోపి,అల్లూరి సీతారామరాజు లాంటి సూపర్ హిట్ మూవీస్ లో యాక్ట్ చేశారు కృష్ణ గారు.ఆ తర్వాత కృష్ణ, ఇందిరా దేవి లకు 1969 లో పద్మావతి అనే కూతురు జన్మించింది. ఇక అదే సంవత్సరంలో అంటే 1969 లో కృష్ణ తన సహనటి అయిన విజయనిర్మల ని


ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు.
విజయనిర్మల మొదటి వివాహం : అప్పటికే విజయనిర్మల గారికి కూడా కృష్ణమూర్తి అనే వ్యక్తితో వివాహం అయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతనే ఒకప్పటి హీరో నరేష్ గారు ప్రస్తుతం క్యారెక్టర్
ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. అయితే విజయనిర్మలకి ఆమె మొదటి భర్త కృష్ణమూర్తికి మధ్య మనస్పర్థలు ఉన్న కారణంగా విజయనిర్మల తన కొడుకు అయిన నరేష తోపాటు కృష్ణమూర్తి కి  దూరంగా వేరేగా ఉంటుంది.  ఇక కృష్ణ విజయ నిర్మల కలిసి దాదాపు 47 సినిమాల్లో హీరో హీరోయిన్ లు గా యాక్ట్చే శారు.
సాక్షి సినిమా షూటింగులో చిగురించిన ప్రేమ : ఇక వీరిద్దరి మధ్య ప్రేమ 1967 లో రిలీజ్ అయిన సాక్షి మూవీ షూటింగ్ టైంలో చిగురించింది. సాక్షి సినిమా షూటింగ్ లో భాగంగా మీసాల కృష్ణుడు


గుడిలో తాళికట్టు వేల అనే పాట కృష్ణ విజయనిర్మల మీద చిత్రీకరించారు. 
హాస్యనటుడు రాజబాబు వీరి వివాహాన్ని ముందే ఊహించారా ??? ఇక షూటింగ్ పూర్తయ్యాక హాస్య నటుడైన రాజబాబు కృష్ణ విజయనిర్మలతో ఇక మీరిద్దరూ భార్యాభర్తలు అయిపోయినట్టే అన్నాడు. అప్పటికే కృష్ణకి ఇందిరా దేవితో వివాహము అయ్యి ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే విజయనిర్మల కి కూడా కృష్ణమూర్తి అనే వ్యక్తితో కొడుకు ఉన్నాడు. దాంతో రాజబాబు అన్న ఆ మాటలకి విజయనిర్మల కి చాలా కోపం వచ్చింది. ఇక 1, జూలై 1967లో సాక్షి మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది.  దాంతో కృష్ణ విజయనిర్మల


కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే వీరి మధ్య స్నేహం కూడా పెరిగింది, అంతేకాకుండా షూటింగ్ గ్యాప్ లో కృష్ణ గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించేది విజయ నిర్మల.  షూటింగ్ టైంలో విజయనిర్మల భోజనం వండి క్యారేజీలో తీసుకొచ్చి కృష్ణకి తినిపిస్తూ ఉండేది. చాలా సినిమాల్లో విజయనిర్మలతో కలిసి నటించడం అలాగే తన మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడం తో  విజయనిర్మల మీద ఇష్టం ఏర్పడింది హీరో కృష్ణ కి. ఇలా జరుగుతూ ఉండగా ఒక సినిమా షూటింగ్ లో చిత్రీకరించిన మీసాల కృష్ణుడి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఎవరైనా ఇద్దరు కలిసి జంటగా ఆ గుడికి వెళితే తప్పకుండా ఆ ఇద్దరికీ వివాహం అవుతుందని. ఇదిలా ఉండగా ఒక సినిమా షూటింగ్ లో చంద్రమోహన్ ఒకసారి విజయనిర్మల తో సూపర్ సార్ కృష్ణ కి విజయనిర్మల ని వివాహం చేసుకోవాలని ఆలోచన ఉందని తెలియజేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి సూపర్ స్టార్ కృష్ణ తనంతట తానే విజయనిర్మల ని మనిద్దరం పెళ్లి


చేసుకుందామని అడిగాడు. అందుకు విజయనిర్మల కూడా సంతోషంగా ఒప్పుకుంది.
మొదటి వివాహమైన 7 ఏళ్లకే రెండో వివాహం చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ
అలా సూపర్ స్టార్ కృష్ణ తన మొదటి భార్య ఆయన ఇందిరా దేవిని వివాహం చేసుకున్న తర్వాత కేవలం ఏడేళ్లకే విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సూపర్ స్టార్ కృష్ణ తను విజయనిర్మల ని పెళ్లి చేసుకోవడానికి కంటే ముందు అతని మొదటి భార్య అయిన ఇందిరా దేవిని కూడా వేరే వివాహం చేసుకోమని చెప్పాడు. అయితే వారికి అప్పటికే


ఇద్దరు పిల్లలు రమేష్ బాబు, పద్మావతి పుట్టారు, అలాగే ఇందిరా దేవికి తన భర్త అయిన సూపర్ స్టార్ కృష్ణ  అంటే అపరిమితమైన ప్రేమ అందుకే వేరే వివాహం చేసుకోడానికి ఒప్పుకోలేదు. విజయనిర్మలనీ వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కృష్ణ గారితో చెప్పింది ఇందిర.
తిరుపతిలో రహస్య వివాహం చేసుకున్న కృష్ణ విజయనిర్మల లు
దాంతో కృష్ణ విజయనిర్మల తిరుపతిలో కేవలం నలుగురు సమక్షంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే కృష్ణ విజయనిర్మలని రెండో వివాహం చేసుకున్న తర్వాత ఇందిరాదేవినీ కూడా ఏ లోటు రాకుండా ప్రేమగా చూసుకున్నాడు. అలాగే ఇందిరా దేవి తన ఇంట్లో జరిగే పుట్టిన రోజు వేడుకలకు కృష్ణతో పాటు విజయనిర్మల ని కూడా ఆహ్వానించేవారు. ఇక కృష్ణ విజయ నిర్మల లు


దాదాపు 47 సినిమాల్లో యాక్ట్ చేశారు. విజయనిర్మల ఆర్థికంగా ఏనాడూ కృష్ణ మీద ఆధారపడలేదు. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అప్పటికే వివాహమైన కృష్ణని రెండో వివాహం చేసుకున్నారు కదా మొదటి భార్య నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి అని ప్రశ్నించినపుడు, అటువంటిదేమీ లేదని పైగా అక్కయ్య అంటే ఇందిరాదేవి తనతో ఎప్పుడూ మీ ఆయన్ని అంటే కృష్ణుని నువ్వే చూసుకోవాలి అని చెబుతూ ఉండేదని  ఎంతో ఆనందంగా చెప్పింది. కేవలం ఇందిరాదేవే  కాకుండా వారి పిల్లలు కూడా తనతో


చాలా మర్యాదగా ప్రదర్శిస్తారని ఎంతో సంతోషంగా చెప్పింది విజయ నిర్మల. కృష్ణ విజయ నిర్మల కి పిల్లలు పుట్ట లేదు. కానీ కృష్ణ ఇందిరదేవికి మాత్రం 1970లో మంజుల, 1975లో మహేష్ బాబు, 1979 లో ప్రియదర్శిని పుట్టారు. తన భర్త మరొక స్త్రీని వివాహం చేసుకున్నా తన భర్త మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు ఇందిరకి తన భర్త ఇష్టమే తన ఇష్టంగా భావించింది. ఇందిరా దేవికి కృష్ణ అంటే చాలా ప్రేమ. కృష్ణ విజయనిర్మలను వివాహం చేసుకున్న తర్వాత ఇంటిగుట్టు బయటకు రానీయ లేదు ఇందిరా దేవి. ప్రస్తుతము సోషల్ మీడియా డెవలప్ అవ్వడం వలన కృష్ణ మొదటి భార్యని చూడగలుగుతున్నాము


కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరికీ తెలియదు ఇందిరా దేవి ఎలా ఉంటుందో!ఎందుకంటే పార్టీలకైనా ఫంక్షన్లకైనా కృష్ణ ఎప్పుడు తన రెండో భార్య అయిన విజయనిర్మలతోనే వచ్చేవాడు. విజయనిర్మల ఇందిరాలు కృష్ణని ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించేవారు అందువల్ల వారి కుటుంబంలో ఎలాంటి కలహాలు రాలేదు.
తన భర్త సూపర్ స్టార్ కృష్ణ ని ప్రాణం కంటే అధికంగా ప్రేమించిన ఇందిరా దేవి : భర్త అంటే ఏంతో అపరిమితమైన ప్రేమ ఇందిరా దేవికి, తన భర్త


సూపర్ స్టార్ కాబట్టి తాను విజయ నిర్మల విషయంలో గొడవపడితే ఆయన పరువకు నష్టం వాటిల్లుతుందని భావించి మౌనంగా ఉండిపోయింది. పైగా ఒక మనిషి నచ్చితే ప్రేమించడంలో తప్పు లేదని కాబట్టి కృష్ణ విజయనిర్మలని ప్రేమించాడు అందువల్ల ఆమె వివాహం చేసుకున్నారని కృష్ణనీ సమర్ధించేవారు ఇందిరా దేవి. అలాగే విజయనిర్మల కూడా కృష్ణనీ అమితంగా ప్రేమించింది కాబట్టి ముందుగా వివాహమై కుమారుడు అయిన నరేష్ ఉన్నా తన  మొదటి భర్తని వదిలేసి కృష్ణ దగ్గరికి వచ్చేసింది. అలాగే  కృష్ణ గారిని వివాహం చేసుకోవడం వల్ల కృష్ణ మొదటి భార్య పిల్లలకు తన వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకూడదని భావించేది విజయనిర్మల అందుకు తగ్గట్టుగా జాగ్రత్తగా వ్యవహరించేది విజయ నిర్మల.
మహేష్ బాబు అంటే ప్రాణం విజయనిర్మల కి  విజయనిర్మల కి మహేష్ బాబు అంటే అపరిమితమైన ప్రేమ. మహేష్ బాబు అందాన్ని చూసి పొంగిపోయేది విజయ నిర్మల. కృష్ణ కంటే బెటర్ ఫర్ఫార్మర్ అని పొగుడుతూ ఉండేది


విజయ నిర్మల, అలాగే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే జంటగా చూసి ప్రశంసించేవారు. ఇందిరా దేవి ఎంతటి  మహోన్నతురాలో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు అదేంటంటే ఎన్టీ రామారావు తన మొదటి భార్య చనిపోయాక తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తోడు కోసం లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహం వారి కుటుంబంలో  ఎంతటి కల్లోలాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక కృష్ణ విషయానికొస్తే తన మొదటి భార్య ఇందిరా దేవి బ్రతికుండగానే విజయనిర్మలని  వివాహం చేసుకున్నారు పైగా ఇందిరా దేవి బ్రతికుండగానే కేవలం ఏడు సంవత్సరాలకే విజయ నిర్మల ని రెండో వివాహం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. అయినా చాలా  గుట్టుగా ఉండిపోయింది వారి కుటుంబము. ఇక కేవలం ఇందిరాదేవి మాత్రమే కాకుండా కృష్ణ మొదటి


భార్య పిల్లలు కూడా మర్యాదగానే ప్రవర్తించేవారు విజయనిర్మలతో. ఇలా ఇద్దరు భార్యలు సఖ్యతగా కలిసి ఉండటం చరిత్రలో రాజుల విషయంలో చూసి ఉంటాము. ఇక నిజజీవితం  లో అంటే కృష్ణ ఇద్దరు భార్య లే. కేవలం భార్యలే కాకుండా వారి పిల్లలు కూడా సఖ్యతగా ఉండటం మరో ఆసక్తికరమైన అద్భుతమైన విషయము.
విజయనిర్మల ని వివాహం చేసుకున్న తర్వాత కూడా మొదటి భార్య ఇందిరాదేవితో పిల్లల్ని కన్న కృష్ణ అలాగే తనని వివాహం చేసుకున్నాక కూడా మొదటి భార్యతో పిల్లల్ని కన్నారు సూపర్ స్టార్ కృష్ణ, ఇందుకు ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు విజయనిర్మల. అలాగే ఏ స్త్రీ అయినా తన భర్త వేరే స్త్రీనిగా చేసుకున్నాక అతనిని తన దరికి రానీయదు. కానీ ఇక్కడ ఇందిరా దేవి, రెండో వివాహము చేసుకున్నాక కూడా ఆయనతో పిల్లల్ని కన్నారు. ఇలా ఇద్దరు భార్యలను తనని ఇంతగా ప్రేమించి అర్థం చేసుకొని  సఖ్యతగా


ఉండటం సూపర్ సార్ కృష్ణ అదృష్టం అని చెప్పాలి.
విజయనిర్మల కృష్ణ లు దాదాపు యాభై ఏళ్ళు కలిసి జీవించారు. ఇందిరా దేవి తన పెద్ద కుమారుడైన రమేష్ బాబు దగ్గర ఉండేది.
రెండో భార్య విజయనిర్మల మరణం విజయనిర్మల 27 జూన్, 2019 లో హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయింది. విజయనిర్మల మరణించాక కృష్ణుని తమ వద్దకు రమ్మని కోరారు మహేష్ బాబు, రమేష్ బాబు  లు. అయితే కృష్ణ అందుకు ఒప్పుకోలేదు విజయనిర్మల


తో కలిసి జీవించిన ఇంట్లోనే ఆయన ఉండిపోయారు. అలాగే కృష్ణ అభిప్రాయానికి గౌరవం ఇచ్చారు ఆయన పిల్లలు.
మొదటి భార్య ఇందిరాదేవి మరణం ఇక september 28,2022 లో కృష్ణ మొదటి భార్యయిన ఇందిరాదేవి మరణించారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....!

Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!

Jabardast Chammak Chandra Family Photos : జబర్దస్త్ చమ్మక్ చంద్ర ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పుడైనా మీరు చూశారా..?