Mysterious Temples In India - భారతదేశంలోని కొన్ని అసాధారణ దేవాలయాలు
Mysterious Temples In India - భారతదేశంలోని కొన్ని అసాధారణ దేవాలయాలు
సాధారణంగా మనమంతా మనసు ప్రశాంతత పొందడానికి గుళ్ళు, గోపురాలు సందర్శిస్తూ ఉంటాము. కొంతమంది తమ చుట్టుపక్కల దగ్గరగా ఉన్న ఆలయాలను సందర్శించడానికి ఇష్టపడితే మరి కొంత మంది కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలను సందర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అలాంటి ఒక ప్రత్యేక దేవాలయం గురించి ఇప్పుడు చూద్దాం.
భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో జైపూర్ నుండి నూటమూడు కిలోమీటర్ల దూరంలో జైపూర్ ఆగ్రా హైవేపై ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయం ఒక అసాధారణ దేవాలయం. ఈ ఆలయాన్ని భక్తులు ఏడాది పొడుగునా అత్యధికంగా సందర్శిస్తూ ఉంటారు.
ఈ ఆలయంలో హనుమంతున్ని బాలాజీ పేరుతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక ఈ ఆలయం ప్రత్యేకంగా దుష్ట శక్తుల అంటే చేతబడి, దెయ్యం పట్టడం మొదలైన వాటి బారిన పడిన వ్యక్తులకు నయం చేసే భూత వైద్యం యొక్క అద్భుతమైన శక్తులను కలిగి ఉంటుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.
ఈ ఆలయాన్ని ముఖ్యంగా ఆంజనేయస్వామికి ఎంతో ఇష్టమైన రోజులుగా భావించే మంగళ మరియు శనివారాల్లో భక్తులు ఈ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు .
ఇక సాధారణంగా అన్ని దేవాలయాల్లో భక్తులకు ప్రసాదాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ ఆలయంలో మాత్రం భక్తులకు ఎలాంటి ప్రసాదాన్ని ఇవ్వరు.
అంతేకాకుండా ఆ ఊర్లోని స్థానికులు ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే వారికి ఈ ఆలయం పరిసరాల్లో ఎలాంటి ఆహార పదార్థాలు కానీ కనీసం మంచినీటిని కానీ తీసుకోవద్దని సూచిస్తారు. ఇదే కాక ఈ ఆలయంలో లోపల ఇతరులతో మాట్లాడడాన్ని మరియు తాకడాన్ని నిషేధిస్తారు.
అలా ఆలయంలో వేరే వారితోనైనా మాట్లాడితే ఆ వ్యక్తికి ఉన్న వ్యాధి వారికి కూడా సోకే అవకాశం ఉంటుందని భావిస్తారు . ఇక ముఖ్యంగా ఈ ఊరికి వచ్చిన వారు ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మాత్రమే ఊరు విడిచి వెళ్లాలని అక్కడి స్థానికులు చెప్తారు.
చూశారుగా ఇంతటి ప్రత్యేకతలున్న ఆలయాన్ని దర్శించాలని మీకు అనిపిస్తే తప్పకుండా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మెహందీపూర్ లోని ఆలయానికి ఒకసారి వెళ్లండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి