Andhra Magaya Pachadi - Magaya Pickle

Andhra Magaya Pachadi - Magaya Pickle 


మాగాయ పచ్చడిని ఇలా కొలతలతో చేసి చూడండి ఏడాది పాటు తాజాగా ఉంటుంది
ఎండాకాలం వచ్చేసింది కదా ఇప్పుడు మనకి మార్కెట్లో లేదా మన పెరట్లో దొరికే పుల్లటి మామిడికాయలతో ఇలా సరైన కొలతలతో మాగాయ పచ్చడి తయారు చేసి చూడండి మొదటిసారి తయారుచేసినా చాలా రుచికరంగా ఉండడమే కాకుండా ఏడాది పాటు తాజాగా నిల్వ ఉంటుంది.



మాగాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్ధములు
మామిడికాయ ముక్కలు - 2 కప్పులు  లేదా 6 మామిడికాయలు
పసుపు - 2 టీ స్పూన్లు 
ఉప్పు - 1/4 కప్పు
కారం  - 1/2 కప్పు
ఆవాలు - 4 టీ స్పూన్లు 
నువ్వుల నూనె
లేదా పల్లీ నూనె - 1 1/2 కప్పులు 
మెంతులు - 2  టీ స్పూన్లు

మాగాయ పచ్చడి తయారు చేసే విధానం
ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి  తుడిచి ఆరబెట్టాలి. మామిడికాయలు తడి లేకుండా శుభ్రంగా ఆరాకా మామిడికాయ ముక్కల్ని 2 ఇంచుల ముక్కలుగా తరగాలి.
2.అలా ముక్కలన్నీ తరిగాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా ఏదైనా ఒక గిన్నెలో కానీ రెండు ఇంచుల సైజులో తరిగిన మామిడికాయ ముక్కలు, 1/4  కప్పు ఉప్పు మరియు రెండు టీ స్పూన్ల పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మూడు రోజులపాటు అలాగే వదిలేయాలి.
3.నాలుగవ రోజు ఉదయాన్నే మామిడికాయ ముక్కలను నానబెట్టిన గిన్నె లేదా డబ్బా మూత తీసి మామిడికాయ ముక్కల్ని గట్టిగా పిండి ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో పెట్టాలి.
4. అలాగే మామిడికాయలు ముక్కల ని పిండాక వచ్చిన ఊటని ఒక పళ్లెంలో పోసి ఒక గంట పాటు ఎండలో పెట్టి తర్వాత లోపలికి తీసుకొచ్చేయాలి.
5. ఒకవేళ ఎండ కనక బాగా ఉంటే మామిడికాయ ముక్కల్ని ఐదారు గంటల పాటు ఎండబెడితే సరిపోతుంది. ఎందుకంటే ముక్కలు మరీ ఎండిపోయినా పచ్చడి అంత రుచిగా ఉండదు.

ఇప్పుడు మాగాయ పచ్చడి కలిపే విధానాన్ని చూద్దాం
అన్ని పదార్థాలను కొలవడానికి ఒకే కప్పును ఉపయోగిస్తే కొలత సులువుగా ఉంటుంది.
ముందుగా ఒక పెద్ద బేసిన్ ని తీసుకుని అందులో మామిడికాయ ముక్కల ని పిండగా వచ్చిన ఊటని పొయ్యాలి. ఆ ఊటలో 1/4 కప్పు ఉప్పు,1/2 కప్పు కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో 1 కప్పు పల్లీ నూనె లేదా నువ్వుల నూనె మరియు రెండు టీ స్పూన్ల మెంతులను దోరగా వేయించి చల్లారాక మెత్తగా చేసిన పొడిని వేసి కలపాలి. ఇప్పుడు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలను కూడా ఈ మిశ్రమంలో వేసి, ముక్కలకు కారం, ఉప్పు, నూనె, మెంతిపిండి బాగా పట్టేలాగా కలపి పక్కన పెట్టాలి .
ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక మూకుడు ని పెట్టి దాంట్లో 1/2 కప్పు నువ్వుల నూనె లేదా పల్లీ నూనె వేసి దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర,  రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించి పోపు వేగాక స్టవ్ మీద నుంచి కిందికి దింపేసి బాగా చల్లారనివ్వాలి. గంట గంటన్నరకి పోపు బాగా చల్లారాక మాత్రమే ఇందాక తయారు చేసి పెట్టుకున్న మాగాయ పచ్చడిలో వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరమైన మాగాయ పచ్చడి తయారైపోతుంది. ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఈ మాగాయని పెట్టి గట్టిగా మూత పెడితే ఏడాది పాటు తాజాగా ఎంతో రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా కొలతలతో తయారు చేసి చూడండి.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!