Telugu - Tollywood Singers Divorce Latest Updates

మన ఫిల్మ్ ఇండస్ట్రీలో  ఎంత మంది  ప్లేబ్యాక్ సింగర్స్ విడాకులు తీసుకుని విడిపోయారో తెలుసా!!!

ఫిలిం ఇండస్ట్రీలో వివాహం చేసుకోవడం విడిపోవడం చాలా సర్వసాధారణమైన విషయం. అయితే కొంత మంది విడిపోతే మరి కొంతమంది మాత్రం కడదాకా కలిసే ఉంటారు. కొంచెం పాపులారిటీ రాగానే ప్రేమ పెళ్లి  అంటూ వివాహాలు చేసుకుంటూ ఉంటారు కానీ ఆ వివాహాలు అతి త్వరలోనే విడాకులకు దారి తీస్తున్నాయి. అలా విడాకులు తీసుకుని విడిపోయిన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

S.P.చరణ్  :ప్రముఖ సింగర్ ఎస్ పి చరణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అన్న విషయం


అందరికీ తెలిసిందే. ఎస్పీ చరణ్ 1998లో స్మిత అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఎస్పీ చరణ్ మొదటి భార్య  నుంచి 2002లో విడాకులు తీసుకున్నాడు.

సింగర్  సునీత : సింగర్ సునీత ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో పుట్టింది. సింగర్ సునీత కిరణ్ అనే  వ్యక్తిని ప్రేమించీ మరీ వివాహం చేసుకుంది. సింగర్ సునీత మొదటి భర్త కిరణ్ మీడియాలో పనిచేస్తాడు.

SINGER1

సునీత తల్లిదండ్రులకి ఆ వివాహం ఇష్టం లేకపోవడంతో సునీత ఇంట్లోంచి పారిపోయి మరీ కిరణ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.ఆశ్చర్యకరంగా పారిపోయి మరీ ప్రేమ వివాహం చేసుకున్న సింగర్ సునీత దాదాపు పదమూడేళ్ళ కు మొదటి భర్త కిరణ్ నుంచి విడిపోయింది. అందుకు కారణంగా తన భర్త మొండివాడు, మూర్ఖుడు, అనుమానం మనిషి అని అందుకే విడాకులు తీసుకున్నాను అని చెప్పింది!!!!


ఇక ఆ మధ్య సునీత రామకృష్ణ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే!!!!

సింగర్ కల్పన రాఘవేంద్రన్ :  ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఒక పాటల ప్రోగ్రాం ద్వారా సింగర్ కల్పన అందరికీ బాగా తెలుసు. సింగర్ కల్పన కేవలం పాటలు పాడడం మాత్రమే కాకుండా దాదాపు 30 తమిళ సినిమాల్లో బాలనటిగా కూడా


నటించింది. సింగర్ కల్పన కి తన కంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రావడంతో తన భర్త తనని మానసికంగా, శారీరకంగా చాలా హింసలు


పెట్టేవాడట. కల్పనకి ఒక కూతురు ఉండడంతో కొన్నేళ్ల పాటు భరించింది అయితే తన భర్తలో ఎలాంటి మార్పు రాకపోవడంతో చివరికి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.

సింగర్ కౌసల్య : ప్రముఖ సింగర్ కౌసల్య ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మ్యూజిక్ డైరెక్షన్ లో ఎక్కువ పాటలు పాడింది. రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్


మూవీ లో కౌసల్య పాడిన 'ఈ రోజే తెలిసిందీ' అనే పాట ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన పాట. కౌసల్య భర్త సుబ్రమణ్యం. కౌసల్య, ఆమె భర్త ఇద్దరూ బాల్య స్నేహితులు. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరిదీ కూడా ప్రేమ వివాహమే. కౌసల్య కి ఒక


బాబు ఉన్నాడు. కౌసల్య తన బాబు కి ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉండగా భర్తతో విడాకులు తీసుకుంది. విడాకులకి కారణాలను తెలియజేస్తూ తన భర్త ఒక శాడిస్ట్ అనీ తనని మానసికంగా,శారీరకంగా చాలా హింసించేవాడు అని చెప్పింది.

సింగర్ మధుప్రియ పెద్దింటి  : సరిలేరు నీకెవ్వరు సినిమా లో హీ ఇస్ సో క్యూట్ అనే పాటతో సింగర్ మధుప్రియ పెద్దింటి విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ పాట కంటే ముందే తనకు పదమూడేళ్ళ వయసప్పుడే మధుప్రియ పెద్దింటి ఆడపిల్లనమ్మా అనే పాటతో ప్రేక్షకులను అలరించింది. మధుప్రియ పెద్దింటి తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శ్రీకాంత్ మంగి అనే అతనిని


ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి పెళ్ళికి శ్రీకాంత్ తల్లిదండ్రులు ఒప్పుకున్నా మధుప్రియ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పటికి మధుప్రియ వయసు కేవలం 18 ఏళ్లు కావడంతో మధుప్రియ తల్లిదండ్రులు వారి


వివాహానికి ఒప్పుకోలేదు. అయినా మధుప్రియ శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుని అతనితో వెళ్ళిపోయింది అయితే వారు ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. అయితే వరకట్న వేధింపులే వీరిద్దరూ దూరం అవడానికి కారణం అని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.

సింగర్ నోయల్  : ర్యాప్ సింగర్, యాక్టర్, టీవీ హోస్ట్ అయిన నోయల్ సినీ నటి ఎస్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎస్టర్ తెలుగు,తమిళ్, కన్నడ


సినిమాల్లో నటించింది. వీరిద్దరూ ఒక ఆల్బంలో కలిసి నటించారు. అలా వారిద్దరి పరిచయం ప్రేమగా మారి జనవరి 2019లో నోయల్ ఎస్టర్ లు వివాహం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా కేవలం ఒక్క


సంవత్సరంలోనే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తమ ఇద్దరి మనస్తత్వాలు వేరని తాము ఇక కలిసి ఉండలేమని అందుకే విడాకులు తీసుకున్నామని ఆ తర్వాత వారిద్దరూ ప్రకటించారు.

వీరు మాత్రమే కాకుండా ఎంత నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి


కూడా త్వరలోనే విడిపోనున్నట్లు  వార్తలు వెలువడుతున్నాయి.సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి లకు శిఖర అనే ఒక పాప ఉంది.

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!