Tollywood Actress - జయప్రద నిజ జీవితంలో అంత దారుణంగా మోసపోయిందా ?? అందుకే భర్తకు విడాకులు ఇచ్చేసిందా ??
అందమైన హీరోయిన్ జయప్రద నిజ జీవితంలో అంత దారుణంగా మోసపోయిందా ?? అందుకే భర్తకు విడాకులు ఇచ్చేసిందా ??
అందమైన హీరోయిన్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న జయప్రద నిజ జీవితంలో మాత్రం చాలా కష్టాలు అనుభవించింది.
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి పేరు,ప్రేక్షకాదరణ పొందింది జయప్రద. అలాంటి జయప్రద జీవితంలో మాత్రం చాలా దారుణంగా దెబ్బతింది.
ఇన్కమ్ టాక్స్ రైడ్ : కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు జయప్రద మీద ఇంకం టాక్స్ రైడ్ జరిగింది . దానివల్ల జయప్రద మానసికంగా చాలా
బాధపడింది అంతే కాకుండా తన కెరీర్ కూడా దెబ్బతింది. ఆ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ నహతా బాసటగా నిలిచాడు. శ్రీకాంత్ నహతా జయప్రద నటించిన గిరిజా కళ్యాణం,సిరిపురం మొనగాడు వంటి సినిమాలను నిర్మించాడు.
శ్రీకాంత్ నెహతా తో పరిచయం : జయప్రద శ్రీకాంత్ నెహతా ల మధ్య అలా పరిచయం
ఏర్పడింది. కష్టకాలంలో ఆదుకున్న శ్రీకాంత్ నహతా తో ప్రేమలో పడింది జయప్రద. అయితే అప్పటికే శ్రీకాంత్ నేహాతా కి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా జయప్రద శ్రీకాంత్ నేహాతా తో గుడ్డి ప్రేమలో పడిపోయింది,దానితో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళిద్దరి గురించి చాలా పుకార్లు వెల్లువెత్తాయి.
జయప్రద శ్రీకాంత్ నెహతా ల రహస్య వివాహం :
అయితే ఆ పుకార్లను నిజం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా జయప్రద 1986లో
రహస్యంగా శ్రీకాంత నేహాతా ని వివాహం చేసుకుంది అయితే శ్రీకాంత్ నెహతా జయప్రదని రెండో వివాహం చేసుకున్నా తన మొదటి భార్య కి మాత్రం విడాకులు ఇవ్వలేదు. అంతే కాకుండా ముగ్గురు పిల్లలు ఉన్న శ్రీకాంత్ నెహతా ని వివాహ మాడడంతో సినిమాల్లో జయప్రదకి అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అలాగే శ్రీకాంత్ నెహతా జయప్రదని రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా తన మొదటి భార్య,
పిల్లలతోనే కలిసి ఉండేవాడు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే శ్రీకాంత్ నెహతా భార్య,జయప్రద తో రెండో వివాహానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు కానీ జయప్రద వివాహం కంటే ముందు శ్రీకాంత్ నెహతా ని పిల్లలు పుట్టకుండా
ఆపరేషన్ చేయించుకోమని కోరింది. దానికి శ్రీకాంత్ నెహతా కూడా ఒప్పుకున్నాడు. అయితే ఈ విషయము జయప్రద కి మాత్రం శ్రీకాంత్ నెహతా ని వివాహం చేసుకున్న తర్వాత మాత్రమే తెలిసింది. దాంతో ఆ విషయాన్ని తట్టుకోలేక జయప్రద ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. ఆ తర్వాత తనను దారుణంగా మోసం చేసిన శ్రీకాంత్ నహతా నుంచి దూరముగా వచ్చేసింది. అలాగే ఆ తర్వాత
తన చెల్లిలి కుమారుడిని దత్తత తీసుకొని అతనికి
సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహము జరిపించింది జయప్రద.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి