Manchu Mohan Babu : Manchu Vishnu - Manchu Manoj తన కొడుకుల గొడవ రచ్చకెక్కడంతో ఆస్తులు పంపకం చేసేసిన మోహన్ బాబు.....!
Manchu Mohan Babu : Manchu Vishnu - Manchu Manoj తన కొడుకుల గొడవ రచ్చకెక్కడంతో ఆస్తులు పంపకం చేసేసిన మోహన్ బాబు.....!
ఆ మధ్య మంచు మనోజ్, మంచు విష్ణులు తమ గొడవతో సోషల్ మీడియాలోకి ఎక్కిన విషయం తెలిసిందే కదా ! ఆ గొడవ కి కారణం మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడం వల్ల వచ్చిందని అప్పట్లో ఒక వార్త బాగా వినపడింది. మంచు మనోజ్ మొదటి భార్య అయిన ప్రణీత మంచు విష్ణు భార్య వెరోనిక స్నేహితురాలు.
తన స్నేహితురాలు అయిన ప్రణీత కి విడాకులు ఇచ్చి మంచు మనోజ్ భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకోవడం వెరోనికా కి అస్సలు ఇష్టం లేదట. కేవలం ఆ కారణమే కాకుండా ఇంకొక కారణం కూడా ఉందిట.అదేంటంటే భూమా మౌనిక రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా వెరోనికా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.
దాంతో ఇరువురి కుటుంబాల మధ్య అనేక తగాదాలు, ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయట. కాబట్టి మౌనిక ని మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచు విష్ణు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదట. అందుకే మంచు విష్ణు కుటుంబం మనోజ్ పెళ్ళికి కేవలం అతిధులు లాగే వచ్చి వెళ్లిపోయారట.
ఇక ఆ తర్వాత మంచు మనోజ్ కి పెళ్లి విషయంలో సహాయపడిన సారధి అనే దూరపు బంధువు మీద కూడా మంచు విష్ణు దాడి చేసిన విషయం తెలిసిందే కదా ! ఆ గొడవని కాస్త వీడియో తీసి మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడంతో మంచు ఫ్యామిలీలో ఉన్న తగాదాలు కాస్తా రచ్చకెక్కాయి.
అయితే కేవలం ఈ విషయమే కాకుండా ఆస్తి పంపకం గురించి కూడా మనోజ్, విష్ణుల మధ్య తగాదాలు జరుగుతున్నాయని మంచు ఫ్యామిలీకి సంబంధించిన కొంత మంది సన్నిహితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.
దాంతో మోహన్ బాబు కొన్ని ఆస్తులు పిల్లలకి పంచేశాడట. అయినా కూడా వారిద్దరి మధ్య వివాదం సద్దుమణగక పోవడంతో మిగిలిన ఆస్తులను కూడా పంచెయ్యడానికి సిద్ధపడ్డాడట మోహన్ బాబు. ఇక ఈ విషయాన్ని నిజం చేస్తూ మోహన్ బాబు ఒక వారం క్రితం షాద్ నగర్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కనిపించడంతో కొంత మంది మీడియా సభ్యులు విషయం తెలుసుకునేందుకు గాను మోహన్ బాబుని ప్రశ్నించారట.
అయితే మోహన్ బాబు ఆ విషయానికి సమాధానం చెప్పకుండా తనను ప్రశ్నించిన మీడియా వారి మీద విపరీతంగా ఫైర్ అయ్యాడట. ఇక దాంతో తన కొడుకుల మధ్య ఉన్న వివాదాన్ని పూర్తిగా ఆపేయడానికి గానూ మోహన్ బాబు మిగిలిన ఆస్తిని కూడా పంచడానికే షాద్ నగర్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాడని ఫిలింనగర్ లో ప్రస్తుతం అంతా అనుకుంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి