Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!


ఛలో సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రష్మిక ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప, యానిమల్ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇక యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక రష్మిక పాపులారిటీ మరింత పెరిగిపోయింది.


సినీ పరిశ్రమలో,రాజకీయ రంగంలో ఉన్న సెలబ్రిటీలకు వారి వృత్తుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా !

గతంలో నిధి అగర్వాల్, డింపు హయాతి, రష్మిక లాంటి తారలంతా వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.అయితే ఇక్కడ విశేషమేంటంటే వేణు స్వామి చేత పూజలు చేయించుకున్న వారిలో రష్మిక మాత్రమే స్టార్ హీరోయిన్.

ఇక రష్మిక నటించిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి రష్మిక పాపులారిటీ బాగా పెరగడంతో తన కుమార్తెకు దిష్టి తగిలి ఉంటుందని భావించిన రష్మిక తల్లి వేణు స్వామి చేత రష్మికకు దిష్టి తీయించిందట! పైగా వేణు స్వామితో పూజలు చేయించుకున్న తర్వాతే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందనే నమ్మకంతో ఆయన్ని తమ ఇంటికి పిలిపించుకుని రష్మీక కి దిష్టి తీయించిందట రష్మిక తల్లి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse