Mahesh Babu - Chiranjeevi - Namrata : ఆ విషయంలో మహేష్ బాబు భార్య నమ్రత అంటే మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన ఇష్టమట...!

Mahesh Babu - Chiranjeevi - Namrata : ఆ విషయంలో మహేష్ బాబు భార్య నమ్రత అంటే మెగాస్టార్ చిరంజీవికి విపరీతమైన ఇష్టమట...!


చిరంజీవి, నమ్రత కలిసి అంజి అనే సినిమాలో నటించారు.2004 సంక్రాంతి కానుకగా విడుదలైన అంజి సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించుగా ఎం శ్యాం ప్రసాద్ రెడ్డి అంజి సినిమాని నిర్మించారు. అయితే 1998లో మొదలైన అంజి సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి దాదాపు 5 ఏళ్లు పట్టింది.

అప్పట్లోనే అంజి సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఆ సినిమాలో ఉన్న ఆరు పాటలకు ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్ లని తీసుకున్నారు. అలాగే అంజి మూవీలోని యాక్షన్ సీన్ల కోసం బాలీవుడ్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఫైట్ మాస్టర్స్ ని రప్పించారు.. అందువల్ల అంజి సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది.

దాంతో షూటింగ్ కాస్త ఆగిపోయింది. అయితే అనుకున్న దాని కంటే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ సినిమాని మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత కాస్త ఆదాయం సమకూరాక షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తూ దాదాపు ఐదేళ్ల పాటు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని అంజి మూవీ షూటింగ్ ని పూర్తి చేసి ఆఖరికి రిలీజ్ చేశారు.

ఇక ఆ ఐదేళ్లలో చిరంజీవికి జంటగా నటించిన నమ్రత శిరోద్కర్ అంజి చిత్ర యూనిట్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్ కి వచ్చేదట. ఎన్ని సార్లు పిలిస్తే అన్నిసార్లు ఎలాంటి విసుగు, కోపం ప్రదర్శించకుండా నమ్రత ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చి నాలుగైదు రోజులు షూటింగ్ చేసి వెళ్లిపోయేదట.

అప్పటికి మిస్ ఇండియా అయిన నమ్రత ఎలాంటి గర్వం ప్రదర్శించకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చేదట. అంత ఓర్పుతో నమ్రత అంజి మూవీ యూనిట్ కి కోపరేట్ చేయడం చిరంజీవికి బాగా నచ్చేసింది అంట.
అందుకే ఒక సందర్భంలో చిరంజీవి నమ్రత గురించి మాట్లాడుతూ అంజి మూవీ షూటింగ్ విషయంలో నమ్రత ఎంతో మర్యాదతో, ఓర్పుతో కోఆపరేట్ చేసిందని నమ్రత సహనానికి, ఓపికకి హాట్సాఫ్ అంటూ ఎంతగానో కొనియాడారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!