Latest Telugu News : ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు బాదం పప్పు ని అస్సలు తినకూడదు...!

Latest Telugu News : ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు బాదం పప్పు ని అస్సలు తినకూడదు...!


బాదంపప్పు లో విటమిన్ E, మెగ్నీషియం, ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 5 నానబెట్టిన బాదం పప్పులు తింటుంటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు లభిస్తాయి. నానబెట్టిన బాదం పప్పు ని ప్రతీరోజు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అయితే ఇక్కడ చెప్పిన ఈ ఆరోగ్య లక్షణాలు ఉన్న వ్యక్తులు బాదంపప్పును తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అధిక బరువు తో బాధపడేవారు ప్రతిరోజు బాదంపప్పు తినడం వలన మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒబేసిటీతో బాధపడేవారు బాదం పప్పును తీసుకోకపోవడమే మంచిది.

బాదంపప్పు లో ఉండే ఆక్సోలేట్లు కిడ్నీలో రాళ్ల సమస్యను పెంచుతాయట. కాబట్టి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు బాదం పప్పుని తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు బాదంపప్పు ని తినకపోవడమే మంచిది. ఎందుకంటే బాదం పప్పు లో పుష్కలంగా ఉండే విటమిన్ E  వలన మరింత తలనొప్పి వస్తుందట.

అజీర్ణ సమస్యతో బాధపడేవారు బాదం పప్పుని తినడం వలన కడుపులో మంట, గ్యాస్ సమస్య వస్తుంది.  కాబట్టి అరుగుదల తక్కువ ఉన్నవారు నాన పెట్టిన బాదం పప్పు ను తినకపోవడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse