Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!
Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!
ఈ రోజుల్లో చిన్న, పెద్ద, బీద,ధనిక అనే తేడా లేకుండా ప్రతినిత్యం సెల్ ఫోన్ ని ఎడాపెడా వాడేస్తున్నారు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నంతసేపు సెల్ ఫోన్ ని చూస్తూనే ఉండేవారు ప్రతినిత్యం మనకి చాలా మందే కనిపిస్తూ ఉంటారు.
ఇక చిన్న పిల్లలైతే ఫోన్ ఇవ్వకపోతే తినడానికి నోరు కూడా తెరవట్లేదు..హోంవర్క్ రాయాలంటే ఫోన్, చదవాలంటే ఫోన్, ఏదైనా పని చేయాలంటే ఫోన్, నిద్ర పొమ్మంటే ఫోన్..అలాగే పెద్దవాళ్లు కూడా ఏ కాస్త టైం దొరికినా సెల్ ఫోన్ ని చూడడమే. ఆఖరికి టీవీలో ప్రోగ్రామ్స్ ని కూడా సెల్ ఫోన్స్ లో చూస్తున్న వాళ్ళు మనకి చాలామంది కనిపిస్తున్నారు.
ఇక తాజాగా సెల్ ఫోన్ వాడకంపై చేసిన పరిశోధనలో ఎన్నో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. నిరంతరం సెల్ ఫోన్ ని చూస్తూ ఉంటే కళ్ళుపొడి బారడం, నిస్సత్తువ, అలసట, తలనొప్పి, నిద్రలేమి, ఏ పని పైన ఆసక్తి లేకపోవడం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయట.
సెల్ ఫోన్ ని అధికంగా ఉపయోగించడం వలన నిద్ర పై చాలా ఎఫెక్ట్ పడి నిద్రలేమి సమస్య ఏర్పడుతుందట.పైగా రోజంతా సెల్ ఫోన్ ని చూస్తూ ఉండడం వలన కంటి సమస్యలు, వెన్నుముక, మెడ, నడుము నొప్పి సమస్యలు వస్తాయట...
మరీ ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలు అంటే 13,14 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు ఉండే పిల్లలు రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తే వారిలో అధిక ఒత్తిడి ఏర్పడి చిరాకు, అలసట, ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా వస్తాయట.. కాబట్టి తల్లితండ్రులు మీ పిల్లల ఆరోగ్యం పట్ల తప్పకుండా జాగ్రత్తలు వహించండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి