Trending Tollywood - Telugu News : విడాకుల బాటలో మరో ప్రముఖ టాలీవుడ్ నటి.....!

Trending Tollywood - Telugu News :
విడాకుల బాటలో మరో ప్రముఖ టాలీవుడ్ నటి...!


ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది.ఏళ్ల తరబడి ప్రేమించుకునీ పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న జంటలు కూడా తమ అభిప్రాయాలు కలవట్లేదు కాబట్టి కలిసి ఉండీ ప్రతి నిత్యం గొడవపడే బదులు విడిపోవడమే మంచిదనే


నిర్ణయానికి వచ్చామని పైగా పరస్పర ఒప్పందంతో ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో ప్రకటించి మరీ విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఇలా విడాకులు తీసుకున్న వారందరూ ఇరు వైపుల పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నవారే . పైగా వారి వివాహానికి కొన్ని కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెడుతున్నారు.

బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్యలు దాదాపు 8 ఏళ్ల పాటు ప్రేమించుకుని ఇరువైపు పెద్దల అంగీకారంతో అక్టోబర్ 2017లో హిందూ సంప్రదాయం ప్రకారం ఒకసారీ అలాగే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరోసారి రెండుసార్లు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా డిసెంబర్ 2021 లో కేవలం నాలుగేళ్లకే తమ విడాకులను ప్రకటించీ తమ అభిమానులు ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇక ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక . నాగబాబు కూతురైన నిహారిక చైతన్య జొన్నలగడ్డ ని డిసెంబర్ 2020 లో రాజస్థాన్ లో ఉన్న ఉదయపూర్ లోని ఒక ప్యాలెస్ లో కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. అయితే ఆశ్చర్యకరంగా వీరిద్దరూ కూడా కేవలం రెండున్నర వీళ్ళకే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ.శ్రీజ మొదటగా 19 ఏళ్ల కే ఇంట్లోంచి పారిపోయి ఎవరికి తెలియకుండా శిరీష్ భరద్వాజ్ అనే అతన్ని రహస్యంగా 2007 లో వివాహం చేసుకుంది. కానీ ఒక కూతురు పుట్టాక 2011లో శిరీష్ భరద్వాజ్ తనని కట్నం కోసం వేధిస్తున్నాడంటూ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తన కూతురితో తిరిగి వచ్చేసింది.

ఆ తర్వాత 2016 లో తన రెండో కూతురు శ్రీజని కళ్యాణ్ దేవ్ అనే వ్యాపారవేత్తతో ఇరు వైపుల పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేశారు మెగాస్టార్ చిరంజీవి.ఇక ఆ తర్వాత శ్రీజ, కళ్యాణ్ దేవ్ లకి కూడా ఒక పాప పుట్టింది. అయితే అధికారికంగా ఇప్పటివరకు వెలువడనప్పటికీ శ్రీజ తన రెండో భర్త నుంచి కూడా విడిపోయి తన ఇద్దరు కూతుర్లను తీసుకుని చిరంజీవి ఇంటికి వచ్చేసిందని అంతా అనుకుంటున్నారు.


ఇక ప్రస్తుతం ఇదే కోవలోకి మరో ప్రముఖ నటి కూడా చేరబోతోందనీ ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది .ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు కలర్స్ స్వాతి.ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన కలర్స్ అనే ఒక పాపులర్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది కలర్స్ స్వాతి.

ఆ టీవీ షో తర్వాత కలర్స్ స్వాతి డేంజర్, అష్టా చమ్మా, గోల్కొండ హై స్కూల్, కార్తికేయ వంటి అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు నే పొందింది. కలర్ స్వాతి 2018 లో వికాస్ అనే వ్యక్తిని ప్రేమించి ఇరువైపుల పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా అతనిని వివాహం చేసుకుంది.


అయితే కొన్ని సంవత్సరాల క్రితమే స్వాతి తన భర్త వికాస్ తో విడిపోయినట్లు వార్తలు వస్తే అవన్నీ వట్టి పుకార్లే అనీ అప్పట్లో మీడియా ముఖంగా ఆ వార్తల్ని ఖండించింది కలర్స్ స్వాతి. అయితే మళ్లీ కొద్ది రోజులుగా కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.


అయితే ఇందుకు కారణం లేకపోలేదు.అదేంటంటే విడిపోయే ముందు సమంత, శ్రీజ కొణిదెల నిహారిక కొణిదెల లు తమ భర్తలతో కలిసి ఉన్న ఫోటోలను తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్లో నుంచి డిలీట్ చేశారు. అలాగే ఈ మధ్యే కలర్స్ స్వాతి కూడా తన భర్త వికాస్ తో ఉన్న ఫోటోలు అన్నిటినీ తన సోషల్ మీడియా అకౌంట్లో నుంచి డిలీట్ చేసేసిందట. దాంతో కలర్స్ స్వాతి కూడా త్వరలోనే తన భర్తతో విడిపోతుందన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers