Trending - Tollywood - Telugu - News - Prabhas : చాలా ఏళ్ల తర్వాత మంచి కామెడీ రోల్ చేయబోతున్న హీరో ప్రభాస్

Trending - Tollywood - Telugu - News - Prabhas: చాలా ఏళ్ల తర్వాత మంచి కామెడీ రోల్ చేయబోతున్న హీరో ప్రభాస్



బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎంతో పాపులారిటీని సంపాదించాడు హీరో ప్రభాస్. అంతేకాకుండా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరగడంతో కేవలం టాలీవుడ్ నిర్మాతలే కాకుండా బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమాని నిర్మించడానికి క్యూ కడుతున్నారట.

అయితే ఇటీవల వచ్చిన ప్రభాస్ ఆది పురుష్  సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎంతో నిరాశ కి గురి చేసింది. మొదట్లో ఆ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ సూపర్ హిట్ అయినట్టే అని టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత అందులో పాత్రలను దర్శకుడు ఓం రౌత్ వక్రీకరించాడంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆది పురుష్ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఇటు తెలుగులో కానీ అటు బాలీవుడ్ లో కానీ ఎలాంటి హిట్టు దొరకలేదు. దాంతో ఫ్యాన్స్ అంతా ప్రభాస్ రాబోయే సినిమాల మీద దృష్టి పెట్టి ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ కొన్ని సినిమాలను చేస్తున్నాడు. వాటిలో డైరెక్టర్ మారుతి సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ మారుతి ముఖ్యంగా కామెడీతో కూడిన సినిమాలు తీస్తాడు. డైరెక్టర్ మారుతి తీసిన సినిమాల్లో భలే భలే మగాడివోయ్, బాబు బంగారం మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు, లవ్ యూ బంగారం, ప్రేమ కథ చిత్రం అలాగే ఇంకా మరెన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.

అలాంటి మారుతి డైరెక్షన్ లో ' రాజా డీలక్స్ ' అనే ఒక హారర్ థ్రిల్లర్ మరియు రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటించబోతున్నాడట హీరో ప్రభాస్. ఆ సినిమా ప్రభాస్ మిగిలిన సినిమాలతో పోలిస్తే కొంచెం తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కుతోందట. పైగా ఆ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారట.

ఇక చివరిగా ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో మంచి కామెడీ పాత్రలో నటించాడు. ఆ తర్వాత ప్రభాస్ తిరిగి పూర్తి స్థాయి కామెడీ రోల్ మారుతీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలోనే చేస్తున్నాడు.దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....!

Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!

Jabardast Chammak Chandra Family Photos : జబర్దస్త్ చమ్మక్ చంద్ర ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పుడైనా మీరు చూశారా..?