Trending Tollywood - Telugu News : Mahesh Babu వామ్మో ! ఆ సినిమాకి మహేష్ బాబు 78 కోట్లు తీసుకుంటున్నాడట....!

Trending Tollywood - Telugu News : Mahesh Babu
వామ్మో ! ఆ సినిమాకి మహేష్ బాబు 78 కోట్లు తీసుకుంటున్నాడట....!



ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది . దాంతో హీరోల రెమ్యూనరేషన్ కూడా పాన్ ఇండియా స్థాయిలో అంతే భారీగా దాదాపు 100 కోట్లకు పైగా ఉంటోంది. పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరోలలో అల్లు అర్జున్,రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, నాని, ప్రభాస్ మొదలైన వారు ఉన్నారు.



అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇంతవరకు పాన్ ఇండియా స్థాయిలో ఇంకా ఏ సినిమాలోనూ నటించలేదు. కానీ మహేష్ బాబు ఇప్పుడు తాను చేస్తున్న ఒక తెలుగు సినిమాలో ఇప్పటిదాకా ఏ తెలుగు హీరో తీసుకోనంతగా భారీ స్థాయిలో దాదాపు 78 కోట్ల రూపాయలు + gst తీసుకుంటున్నాడట. దాంతో ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ పరంగా నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నాడట సూపర్ స్టార్ మహేష్ బాబు.


మహేష్ బాబు ఇంత భారీగా రెమ్యునరేషన్  తీసుకుంటున్న సినిమా గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉంది.గుంటూరు కారం సినిమాకి తమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఇక గుంటూరు కారం సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో
రూపుదిద్దుకుంటుంది.


సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన అల వైకుంఠపురం సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోంది ఈ సినిమాకే . దాంతో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.


ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గుంటూరు కారం సినిమా మీద ఎంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గుంటూరు కారం సినిమా మార్కెట్ దాదాపు 250 కోట్లకు పైగానే ఉందట. కాబట్టి మహేష్ బాబుకి ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడం వలన నిర్మాతకు ఎలాంటి నష్టం జరగదని సినీ పరిశీలకులు అంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!