Sai Dharam Tej - Mega Hero : ఆత్మహత్యయత్నం చేసిన సాయి ధరమ్ తేజ్ కాపాడిన మెగా హీరో

Sai Dharam Tej - Mega Hero : ఆత్మహత్యయత్నం చేసిన సాయి ధరమ్ తేజ్ కాపాడిన మెగా హీరో



తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలోని హీరోలకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో కొంత మంది మొదట్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ద్వారా గుర్తింపుని పొందినప్పటికీ ఆ తర్వాత ఎవరికి వారే తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకున్నారు.


మెగా హీరోలలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రామ్ చరణ్(ram charan)అల్లు అర్జున్(allu arjun) లు , చిరంజీవికి ఉన్నంత  క్రేజ్ ని సంపాదించుకోగలిగారు. ఆ తర్వాత వచ్చిన వరుణ్ తేజ్(Varun Tej), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) , వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) లు  తమ నటనతో పర్వాలేదనిపించారు.


ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో బ్రో సినిమా(bro movie) 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే కదా ! పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండడం వల్ల సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ చాలానే కష్టపడుతున్నాడు.


అలాగే ఈ సందర్భంగా పలు టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఎవరికీ తెలియని విషయాలని తన అభిమానులతో పంచుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్. అలాగే ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించాడు సాయి ధరమ్ తేజ్.


అదేంటంటే తను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాడట సాయి ధరమ్ తేజ్ . ఆ అమ్మాయి కూడా సాయి ధరమ్  తేజ్ ని ఇష్టపడిందట. దాంతో తాను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట. తన ప్రేమ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసి తాను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడట సాయి ధరమ్ తేజ్.


అయితే అప్పటికి సాయి ధరమ్ తేజ్ చదువుకుంటూ ఉండటం వల్ల ముందు ఏదైనా ఉద్యోగం సంపాదించు ఆ తర్వాతే పెళ్లి అని ఆ పెళ్లిని ఆపేసారట సాయి ధరమ్ తజ్ కుటుంబ సభ్యులు. ఈ లోపు కొంత కాలం గడిచాక ఆ అమ్మాయి తల్లి తండ్రులు బలవంతం చేయడంతో ఆ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లి పోయిందట.


ఇక ఆ వార్త తెలిసిన వెంటనే సాయి ధరమ్ తేజ్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. అప్పుడు సాయి ధరమ్ తేజ్ మావయ్య అయిన పవన్ కళ్యాణ్ తనకి ధైర్యం చెప్పి అలాంటి తప్పు పని చేయకూడదని ఆ ప్రేమ విషయాన్ని మర్చిపోయి తన కెరీర్ మీద దృష్టి పెట్టమని సాయి ధరమ్ తేజ్ కి సలహా ఇచ్చాడట పవన్ కళ్యాణ్.


అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ప్రేమ విషయం అలాగే ఆత్మహత్యాయత్నం గురించి తెలియడంతో సాయిధరమ్ తేజ్ కూడా లవ్ లో ఫెయిల్ అయ్యాడని అభిమానులు అంతా అనుకుంటున్నారట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Best Dog Bed in India Online at Amazon.in

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse