Ram Charan - Upasana Konidela - Klin Kaara : చెల్లెలి కోసం నైట్ డ్యూటీ చేస్తున్న అన్నయ్య అంటూ ఫోటో పెట్టిన ఉపాసన క్షణాల్లో వైరల్ చేసేసిన మెగా అభిమానులు

Ram Charan - Upasana Konidela - Klin Kaara : చెల్లెలి కోసం నైట్ డ్యూటీ చేస్తున్న అన్నయ్య అంటూ ఫోటో పెట్టిన ఉపాసన క్షణాల్లో వైరల్ చేసేసిన మెగా అభిమానులు


రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్ళి అయిన పదేళ్లకు మెగా ప్రిన్సెస్ క్లిమ్ కారా పుట్టిన విషయం తెలిసినదే కదా. ఇక మెగా ప్రిన్సెస్ గురించిన వార్తలు కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మెగా ప్రిన్సెస్ గురించి ఏ చిన్న విషయం తెలిసిన దానిని షేర్ చేస్తూ, వైరల్ చేస్తూ మెగా ఫ్యామిలీ మీద తమకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉన్నారు మెగా అభిమానులు.

ఇక ఇప్పటిదాకా మెగా ప్రిన్సెస్ ( Mega Princess )ఫోటోని ఉపాసన కానీ రామ్ చరణ్ కానీ షేర్ చేయలేదు కానీ పాప కనిపించకుండా పాప రూమ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగా అభిమానులను సంతోషపరుస్తూనే ఉన్నారు.

అలాగే ఉపాసన రాంచరణ్ లు ఎప్పటినుంచో రైమ్ అనే కుక్కని పెంచుకుంటున్నారు. రైమ్ అంటే ఉపాసన రాంచరణ్ లకు ప్రాణం.ఎన్నో సార్లు రైమ్ (Rhyme) తో ఉన్న ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఉపాసన రాంచరణ్ లు.

అంతే కాకుండా తమ పెంపుడు కుక్క అయిన రైమ్ కోసం సోషల్ మీడియాలో స్పెషల్ గా ఒక అకౌంటు ను కూడా క్రియేట్ చేశారు.ఆ అకౌంట్లో రైమ్ కు సంబంధించిన విషయాలను, ఫోటోలను తమ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు.


అలాగే ఇప్పుడు తాజాగా రైమ్ అకౌంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోని షేర్ చేసింది ఉపాసన. ఆ ఫోటోలో రైమ్ ఉయ్యాలలో ఉన్న మెగా ప్రిన్సెస్ ని ఎంతో ఆసక్తిగా చూస్తోంది. ఆ ఫోటోలో మెగా ప్రిన్సెస్ క్లిమ్ కారా కనపడట్లేదు కానీ అక్కడ ఉన్న ఉయ్యాలలో క్లింకారా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ ఫోటోకి క్యాప్షన్ గా 'చెల్లెలి కోసం నైట్ డ్యూటీ చేస్తున్న అన్న' అని పెట్టింది ఉపాసన. దాంతో మెగా అభిమానులు క్షణాల్లో ఆ ఫోటోని లైక్ లతో, షేర్లతో వైరల్ చేసేసారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!