Anchor Suma - Rajeev Kanakala : రాజీవ్ కనకాల అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చాడన్న సుమ..! దాంతో పెద్ద గొడవే జరిగిందట..!

Anchor Suma - Rajeev Kanakala :
రాజీవ్ కనకాల అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చాడన్న సుమ..! దాంతో పెద్ద గొడవే జరిగిందట..!


చాలా కాలంగా యాంకర్ సుమ బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. సుమ కేవలం యాంకరే కాకుండా నిర్మాత కూడా.ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన స్టార్ మహిళ అనే గేమ్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది యాంకర్ సుమ. భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘమైన టీవీ గేమ్ షో గా స్టార్ మహిళ రికార్డును నెలకొల్పింది.

యాంకర్ సుమ మలయాళీ అయినప్పటికీ చాలా స్పష్టమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడడంతో అనేక తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్స్ కి,ఫిలిం అవార్డులకి యాంకర్ గా అంతా సుమనే కోరుకుంటూ ఉంటారు.

యాంకర్ సుమ నటుడైన రాజీవ్ కనకాలని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే కదా ! వీరికి రోషన్ కార్తీక్ అనే కుమారుడు మనస్విని అనే కుమార్తె ఉన్నారు. ఇక ఇటీవల యాంకర్ సుమ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త రాజీవ్ కనకాల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.

అదేంటంటే ఓసారి రాజీవ్ కనకాల అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడట.దాంతో సుమకి చాలా కోపం వచ్చిందట. అయితే ఆమె మర్నాడు వెళ్లిపోయాక రాజీవ్ కనకాల తో ఆ అమ్మాయి విషయమై యాంకర్ సుమ కోపంతో చాలా గొడవ పడిందట.

అయితే అప్పుడు రాజీవ్ కనకాల తను నటిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ అని ముంబై నుంచి వచ్చిందని, అందుచేత ఆ రాత్రికి ఆ హీరోయిన్ ని తమ ఇంట్లో ఉండడానికి ఆహ్వానించానని రాజీవ్ యాంకర్ సుమకి చెప్పాడట.

అయితే ఆ విషయం తనకు తెలియకపోవడం వల్ల సుమ చాలా గొడవ పడిందట రాజీవ్ కనకాలతో. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత మరెప్పుడూ కూడా రాజీవ్ కనకాల తనకు చెప్పకుండా ఎవరిని ఇంటికి తీసుకు రాలేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది యాంకర్ సుమ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!