Vijay Devarakonda - Rashmika : త్వరలోనే ఎంగేజ్మెంట్ అలాగే వివాహం చేసుకోబోతున్న విజయ్ రష్మికలు

Vijay Devarakonda - Rashmika : త్వరలోనే ఎంగేజ్మెంట్ అలాగే వివాహం చేసుకోబోతున్న విజయ్ రష్మికలు



విజయ్ దేవరకొండ, రష్మిక మందనాలు 2018 లో గీత గోవిందంలో అలాగే 2019 లో డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే.
ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి వీరిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఇక ఈ రెండు సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఈ ఇద్దరి ఫ్యాన్స్ అంతా వీరి జంట ఎంతో అద్భుతంగా ఉందని నిజ జీవితంలో కూడా వీరిద్దరూ వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకోవడం మొదలుపెట్టారు.

దానికి తగ్గట్టే విజయ్, రష్మికలు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిసార్లు రెస్టారెంట్స్ లో అలాగే మాల్దీవ్స్ లో కలిసి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో అనేక పుకార్లు వెల్లువెత్తాయి.

ఇక రష్మిక విషయానికి వస్తే 2016 లో కిరిక్ పార్టీ  అనే కన్నడ సినిమాతో తొలి సారిగా సినీ రంగంలోకి ప్రవేశించింది. ఇక అదే సమయంలో రష్మిక ఆ సినిమాలో తన సహనటుడైన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి 2017 జూలై మూడవ తారీఖున ఇరువైపుల పెద్దల అంగీకారంతో రష్మిక,రక్షిత్ షెట్టి లు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

అయితే 2018 లో తమ ఇద్దరి అభిప్రాయాలు కలవకపోవడంతో తమ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా వీరు ఇరువురు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక అదే సమయంలో రష్మిక విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసినదే.

గీత గోవిందం సినిమా షూటింగ్ సమయంలోనే  రష్మిక విజయ్ దేవరకొండతో ప్రేమలో పడిందని అందుకే 2018 లో రక్షిత్ శెట్టితో జరిగిన తన నిశ్చితార్థాన్ని రద్దు చేస్తుందని అనేక పుకార్లు వెలువెత్తాయి.

గీత గోవిందం సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా రష్మిక విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోవడమే కాకుండా అనేక సందర్భాలలో కలిసి పార్టీలు, పండగలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే ఆ ఊహాగానాలను నిజం చేస్తున్నట్లుగా ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే అతి త్వరలో రష్మిక విజయ్ దేవరకొండ ల కుటుంబ సభ్యులు వీరిద్దరికీ నిశ్చితార్థం చేయబోతున్నారని అలాగే వచ్చే సంవత్సరంలో వీరిద్దరికి ఘనంగా వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు అన్న వార్త ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.


ఇక ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అటు విజయ్ దేవరకొండ కానీ ఇటు రష్మిక మందన కానీ ఈ విషయంపై స్పందిస్తే తప్ప ఆ వార్తలో ఇంత నిజమునే విషయం తెలీదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!