Tollywood News - Naga Babu : Niharika కోసం ఆత్మహత్యయత్నం చేసిన నాగబాబు

Tollywood News - Naga Babu : Niharika కోసం ఆత్మహత్యయత్నం చేసిన నాగబాబు


ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత గౌరవప్రదమైన స్థానం ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తర్వాత నాగబాబు ,పవన్ కళ్యాణ్ హీరోలుగా ఎంట్రీ ఇస్తే వారిలో పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్ అవ్వగా నాగబాబు ఒకటి రెండు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా, కొన్ని బుల్లితెర షోలలో జడ్జిగా, కొన్ని సీరియల్స్ లో  కీలకపాత్రలలో నటించాడు.


నాగబాబుకి తన కొడుకు వరుణ్ తేజ్ కంటే  కూడా కూతురు నిహారిక కొణిదెల అంటే చాలా ఇష్టం. ఇక నాగబాబు ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురైన నిహారిక కోసం తను ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పాడు.


తను అలా ఎందుకు చేసాడో వివరిస్తూ ఒకసారి తన భార్య, పిల్లలతో కలిసి విహారయాత్రికని న్యూజిలాండ్ కి వెళ్ళాడట. అప్పుడు వరుణ్ తేజ్, నిహారికలు చాలా  చిన్నవాళ్లట . ఇక ఆ పర్యటనలో ఒకరోజు అచ్చం నాగబాబు లాగే డ్రెస్ వేసుకున్న ఒక అతనితో నిహారిక ఎక్కడికో వెళ్లిపోయిందట.


దాదాపు 20 నిమిషాల పాటు నిహారిక ఎక్కడ ఉందో తెలియలేదట .నిహారిక జాడ తెలియక పోవడంతో ఆ ఆందోళనతో వరుణ్ తేజ్ ని ఇంటికి పంపించేసి తన భార్యతో కలిసి తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట నాగబాబు.


అయితే దాదాపు అరగంట తర్వాత నిహారిక జాడ తెలియడంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానని ఆ టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు నాగబాబు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers