Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..! ఛలో సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రష్మిక ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప, యానిమల్ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇక యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక రష్మిక పాపులారిటీ మరింత పెరిగిపోయింది. సినీ పరిశ్రమలో,రాజకీయ రంగంలో ఉన్న సెలబ్రిటీలకు వారి వృత్తుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా ! గతంలో నిధి అగర్వాల్, డింపు హయాతి, రష్మిక లాంటి తారలంతా వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.అయితే ఇక్కడ విశేషమేంటంటే వేణు స్వామి చేత పూజలు చేయించుకున్న వారిలో రష్మిక మాత్రమే స్టార్ హీరోయిన్. ఇక రష్మిక నటించిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి రష్మిక పాపులారిటీ బాగా పెరగడంతో తన కుమార్తెకు దిష్టి తగిలి ఉంటుందని భావించిన రష్మిక తల్లి వేణు స్వామి చేత రష్మికకు దిష్టి తీయించిందట...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి