Latest News : Sekhar Master కి chiranjeevi ఊహించని షాక్

Latest News : Sekhar Master కి chiranjeevi ఊహించని షాక్ 


టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ప్రస్తుతం ఫుల్ జోష్ తో  దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.నిజం చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోల కంటే సీనియర్ హీరోలే ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే మూవీతో మెగా అభిమానులను త్వరలోనే  అలరించబోతున్నారు.socio fantasy తో మెగాస్టార్ చిరంజీవి, director మల్లిడి వశిష్ట కాంబినేషన్ లో రూపొందుతున్న విశ్వంభర మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇప్పటివరకు విశ్వంభర మూవీకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లని షూట్ చేశారు.

ఆ తర్వాత చిరంజీవి, త్రిష లతో పాటు కొంత మంది నటీనటులతో కొన్ని షెడ్యూల్స్ ని జరిపారు. Visual Wonder గా ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ కోసం ఎంతోమంది స్టార్ నటి నటులతో పాటు టెక్నీషియన్స్ ని కూడా తీసుకుంటున్నారు.

ఇక విశ్వంభర మూవీలోని కొన్ని ముఖ్యమైన పాటల కోసం కొరియోగ్రాఫర్స్ అయిన విజయ్ బిన్నీ,శోభీలను తీసుకున్నారు. ఇప్పటివరకు వారిద్దరూ రెండు పాటలను కంపోస్ చేశారు. ఆ పాటలకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది.ఇక ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కొరియోగ్రాఫర్ల ఎంపిక పైన తాజాగా ఒక చర్చ తెరపైకి వచ్చింది.

విశ్వంభర కంటే ముందు చిరంజీవి నటించిన రెండు సినిమాల్లోనూ శేఖర్ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ గా మొత్తం పాటలను ఇచ్చారు. ఇక శేఖర్ మాస్టర్ చేసిన ఆ పాటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి.అయితే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీకి మాత్రం శేఖర్ మాస్టర్ కి కాకుండా ఇతర కొరియోగ్రాఫర్లకు అవకాశం ఇచ్చారు చిరంజీవి.

అయితే విశ్వంభర మూవీ దర్శకుడు మల్లిడి వశిష్ట కోరినందు వల్లే శేఖర్ మాస్టర్ ని కాకుండా వేరే కొరియోగ్రాఫర్లను తీసుకున్నారు తప్ప ఆ నిర్ణయం చిరంజీవిది కాదని అంటున్నారు. టెక్నికల్ వండర్ గా రాబోతున్న విశ్వంభర మూవీని ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రూపొందిస్తున్నారు. ఆ నేపథ్యంలో  విశ్వంభర మూవీ కోసం పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers