Chiranjeevi Pawan Kalyan Ram Charan Allu Arjun : వీరిలో ఎక్కువ craze ఎవరికి ఉందో తెలుసా ?

Chiranjeevi Pawan Kalyan Ram Charan Allu Arjun : వీరిలో ఎక్కువ craze ఎవరికి ఉందో తెలుసా ?

టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరని అడిగినప్పుడు ఎవరికి వారు తమకు నచ్చిన హీరో పేరు చెప్పడం సహజమే. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎవరు అంటే Sr NTR, అక్కినేని నాగేశ్వరరావు ( ANR ) కృష్ణ (Krishna) శోభన్ బాబు ( sobhan babu) పేర్లు చెబుతూ ఉండేవారు.

ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు టాప్ హీరోస్ అని చెబుతూ ఉండేవారు. ఇక ప్రస్తుత తరంలో టాప్ హీరో ఎవరంటే మాత్రం చెప్పడం కాస్త కష్టమే ! ఎందుకంటే ఇప్పటి హీరోల్లో ఒక్కో హీరో ఒక్కో స్టైల్ ని, ప్రత్యేకతను కలిగి ఉన్నారు. అందుకే టాప్ హీరో ఎవరంటే చెప్పడం అంత సులభం ఏమీ కాదు.

అందుకే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్స్ టాప్ హీరో ఎవరైనా విషయం మీద ఇటీవలే ఒక సర్వే నిర్వహించింది. ఆ సంస్థ ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా,సోషల్ మీడియా ద్వారా సర్వే నిర్వహించి లిస్టులని రిలీజ్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఇటీవలే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ 10 హీరోల లిస్ట్ ని రిలీజ్ చేసింది ఆ సంస్థ.

 ఆ లిస్టులోని టాప్ టెన్ హీరోల జాబితాలో మెగా హీరోలంతా దాదాపుగా చోటు దక్కించుకున్నారు.ఆ టాప్ టెన్ లిస్టులో చిరంజీవి,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్, అల్లు అర్జున్ లు చోటు దక్కించుకున్నారు. టాప్ టెన్ లోని పూర్తి వివరాలు చూస్తే మొదటి ప్లేస్ రెబల్ స్టార్ ప్రభాస్  (prabhas)కి దక్కింది. ఆ తర్వాత రెండవ స్థానంలో మహేష్ బాబు (mahesh babu) ఉండగా మూడవ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ (jr ntr ) దక్కించుకున్నాడు. 

అలాగే నాలుగవ స్థానంలో అల్లు అర్జున్ (allu arjun)  నిలవగా ఐదవ స్థానాన్ని రామ్ చరణ్ దక్కించుకున్నాడు. వీరి తర్వాత ఆరవ స్థానం పవన్ కళ్యాణ్ కి దక్కగా ఏడవ స్థానాన్ని నాచురల్ స్టార్ నాని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఎనిమిదవ స్థానం రవితేజ కి దక్కింది.

తొమ్మిదో స్థానాన్ని విజయ్ దేవరకొండ దక్కించుకున్నాడు.ఇక చివరిగా టాప్ టెన్ స్థానంలో చిరంజీవి నిలిచాడు.దాంతో ఆ లిస్టు ప్రకారం మెగా హీరోలు అందరిలోకీ అల్లు అర్జున్, రామ్ చరణ్ లకి ఎక్కువ క్రేజ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!