Latest Telugu News : March లో ఈ మూడు రాశుల... జీవితం పైన చెడు ప్రభావం..!

Latest Telugu News : March లో ఈ మూడు రాశుల... జీవితం పైన చెడు ప్రభావం..!


జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 2024 మార్చిలో  సూర్యుడు మరియు రాహువు ప్రభావంతో ఈ మూడు రాశుల వారి జీవితం మారబోతోంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మరియూ పాప గ్రహంగా పరిగణించే రాహువు కలయిక వల్ల వివిధ రాశులు, ప్రపంచంపైనా చెడు ప్రభావం పడనుంది. 18 ఏళ్ల తర్వాత మార్చి 14న మీన రాశిలో సూర్యుడు, రాహువు కలవబోతున్నారు. అందువల్ల గ్రహణం కారణంగా కొన్ని రాశుల  వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి : మార్చి 14 న మీనరాశి లో ఏర్పడే గ్రహణ దోషాల వల్ల సింహ రాశి జాతకులు ప్రతికూల ఫలితాలను పొందనున్నారు. ఆ సమయంలో సింహ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, జీవిత భాగస్వామి తో వివాదాలు ఏర్పడతాయి.ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్యం బలహీనపడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ సమయంలో సింహ రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి  : మార్చ్ 14 న ఏర్పడే గ్రహణం తులా రాశి వారికి హానిని కలిగిస్తుంది . ఆ సమయంలో తులా రాశి వారు ఆర్థిక నష్టం ఎదుర్కొంటారు. వ్యాధులతో బాధపడతారు. శత్రువుల వల్ల భయాందోళన చెందుతారు.

కుంభ రాశి : కుంభరాశి వారు మార్చ్ 14 న ఏర్పడే గ్రహణం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం కారణంగా కుంభ రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. గౌరవ, మర్యాదలకు భంగం కలుగుతుంది. ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటారు, వ్యాపారస్తులు వ్యాపారంలో నష్టాన్ని పొందుతారు. స్థిరాస్థి విషయంలో కోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse