Telugu News : ఈ వస్తువులు కాలికి తగిలితే దరిద్రం చుట్టుకుంటుంది జాగ్రత్త....!
Telugu News : ఈ వస్తువులు కాలికి తగిలితే దరిద్రం చుట్టుకుంటుంది జాగ్రత్త....!
మన పెద్దవాళ్లు మనకి ఎన్నో ఆచారాలని చెబుతూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి అసలు ఆ ఆచారాలను ఎందుకు పాటించాలో కూడా తెలియదు. అసలు ఆ ఆచారాల వెనుక ఏమి నిజాలు ఉన్నాయో చూసేద్దాం !
శంఖంలో సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పొరపాటున కాలిని శంఖానికి తగలనివ్వకూడదు.ఎందుకంటే శంఖానికి కాలు తగిలితే ఆర్థికంగా ఎంతో నష్టం సంభవిస్తుందట.
మన హిందూ ధర్మంలో తులసి మొక్కకి, తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవి, శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటారని అంటారు. అందువల్ల ఎప్పుడూ కూడా తులసి మొక్కలకి,తులసి ఆకులకి పాదాలని తగలనీయకూడదు.
ఇక అలాగే ప్రతి నిత్యం మన ఇంట్లో ఉండే చీపురు ని పాదాలతో తాకితే ఆ లక్ష్మీదేవికి కోపం వచ్చి పేదరికాన్ని కలిగిస్తుందని అంటారు.అందుకే ఎప్పుడూ కూడా ఏ చీపురుకైనా పాదాలని తగలనియ్యకూడదు.
క్రింద పడిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా కాళ్లతో తొక్క కూడదు.అలా చేస్తే మనకి అన్నం దొరకదట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి