Soundarya : ఆఖరి కోరిక తీరకుండానే మరణించిన సౌందర్య

Soundarya : ఆఖరి కోరిక తీరకుండానే మరణించిన సౌందర్య



ఇప్పటి హీరోయిన్స్ లాగా మితిమీరిన గ్లామర్ షో చేయకుండా ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది నటి సౌందర్య.సౌందర్య చనిపోయి ఎన్నో ఏళ్లు గడిచినప్పటికీ సౌందర్యని ఆరాధించే వారి సంఖ్య భారీగానే ఉంది.


ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే జీవించేసే సౌందర్య నటనకు అందానికి లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయేవారు. ఈరోజు కనుక సౌందర్య ఉండి ఉంటే ఎన్నో అద్భుతమైన పాత్రలు ప్రాణం పోసుకునేవి అనడం అతిశయోక్తి కాదు.


అయితే ఎంతో కెరీర్ ఉన్న సౌందర్య 2004, ఏప్రిల్ 17న, 31 ఏళ్ల వయసులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో శాశ్వతంగా కన్నుమూసింది.కానీ సౌందర్య మరణించడానికి కొన్ని గంటల ముందు ఒక కోరిక కోరిందట.


అప్పటికే సౌందర్య బిజెపి ( bjp )పార్టీలో చేరడంతో ఆ పార్టీ ప్రచారం కోసం ఎయిర్ పోర్ట్ కి వెళ్లే ముందు తన అన్న భార్యని ఒక కాటన్ చీర, కుంకుమ తీసుకురమ్మందిట. కాటన్ చీర కట్టుకుని బిజెపి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్లాలనుకున్న సౌందర్య తన వద్ద కాటన్ చీర లేకపోవడంతో తన వదినని ఒక కాటన్ చీర కొనుక్కుని తీసుకురమ్మందిట.


అలాగే సౌందర్యకి కుంకుమ ధరించే అలవాటు ఉండటం వల్ల దాన్ని కూడా తీసుకురమ్మని తన వదినకి చెప్పిందట. కానీ అంతలోనే టైం అయిపోవడంతో హెలికాఫ్టర్ ఎక్కేసిన సౌందర్య అది కాస్త కూలిపోవడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతో బాధపడింది సౌందర్య వదిన.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse