Ratha Saptami Date 2024 in Telugu : ఫిబ్రవరి 16న రాబోయే రథ సప్తమి రోజున ఇలా చేశారంటే 7 జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి..!

Ratha Saptami Date 2024 in Telugu : ఫిబ్రవరి 16న రాబోయే రథ సప్తమి రోజున ఇలా చేశారంటే 7 జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి..!


ఈ ఏడాది రథ సప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. రథ సప్తమి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తల మీద 7 జిల్లేడు ఆకులను ధరించీ స్నానం చేయాలి. ఏడు జిల్లేడు ఆకులను తల పైన పెట్టుకునీ స్నానం చేయడం వలన ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు.అలా స్నానం చేశాక ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి నీటిని సమర్పించాలి.

అలా ఉదయిస్తున్న సూర్యుడికి నీటిని
సమర్పించడాన్ని అర్ఘ్యం అని అంటారు. ఉదయిస్తున్న సూర్యుడికి జిల్లేడు ఆకులు,నువ్వులతో నీటిని అర్ఘ్యం గా సమర్పించాలి. సూర్య భగవానుడికి జిల్లేడు ఆకులు అంటే చాలా ఇష్టం. అందువల్ల తల పైన జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేస్తే ఆ సూర్య భగవానుడు అనుగ్రహించి ఏడు జన్మలలో మనం చేసిన పాపాలను నశింప చేస్తాడు.

అలాగే రథ సప్తమి రోజున ఉప్పు దానం చెయ్యడాన్ని శుభప్రదంగా భావిస్తారు. బెల్లంతో చేసిన పరమాన్నాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. రథ సప్తమి రోజున ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం ఎంతో శుభప్రదం.

గోధుమలు, రాగి, పప్పు, బెల్లం రథ సప్తమి రోజున దానం చేయడం వలన ఎంతో శుభం కలుగుతుందని అంటారు.ముఖ్యంగా రథ సప్తమి రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించి నదిలో వదిలితే చాలా మంచిది. అలా చేయడం వలన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!