Phalguna Masam 2024 : ఫాల్గుణ మాసం నెల రోజులూ ...ఆ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే...మీ రాశి ఉందేమో చూడండి..!

Phalguna Masam 2024 : ఫాల్గుణ మాసం నెల రోజులూ ...ఆ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే...మీ రాశి ఉందేమో చూడండి..!

ఫిబ్రవరి 25 నుంచి ఆ శ్రీ మహా విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఫాల్గుణ మాసం ప్రారంభమైంది. ఫాల్గుణ మాసం లో విష్ణువుని పూజిస్తూ దానధర్మాలు చేస్తే మోక్షం లభిస్తుందట. ఎందుకంటే ఆ మహా విష్ణువుకి ఫాల్గుణ మాసం అంటే ఎంతో ఇష్టమట.

లక్ష్మీదేవి కూడా ఫాల్గుణ మాసం లోనే జన్మించిందట. అందుచేత ఫాల్గుణ మాసం లో ఆ శ్రీ మహా విష్ణువు తో పాటు మహాలక్ష్మిని కూడా పూజించిన వారందరికీ విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని హిందూ పురాణాల్లో చెప్పబడింది.

ఇక జ్యోతిషాస్త్ర ప్రకారం కొన్ని రాశు ల వారికి ఫాల్గుణ మాసం ఎంతో అదృష్టాన్ని కలుగజేస్తుందట.ఆ రాశు లు ఏవో ఎప్పుడు చూసేద్దాం.

మేష రాశి : ఫాల్గుణ మాసం మేష రాశి వారికి ఎంతో శుభప్రదమైనది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు .కుటుంబ జీవితం ఆనందమయం అవుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది.

మిధున రాశి : మిధున రాశి వారికి ఫాల్గుణ మాసం ఎంతో అదృష్టాన్ని కలగజేస్తుంది. అన్ని పనుల్లోను విజయం సాధిస్తారు.ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఎంతో అనుకూలమైన సమయం.విద్యార్థులకు అనుకూలమైన సమయము. కుటుంబ జీవితం ఆనందమయం అవుతుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి ఫాల్గుణ మాసంలో ఆరోగ్యపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టడానికి ఫాల్గుణ మాసం ఎంతో అనువైనది. ఆనందమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. విద్యార్థులు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు.

కన్యా రాశి : కన్యా రాశి వారికి ఫాల్గుణ మాసం లో కొత్త పనులు ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఫాల్గుణ మాసం లో విద్యకి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులు మంచి పురోగతిని సాధిస్తారు. కన్యారాశి వారికి వ్యాపారం ప్రారంభించడానికి ఫాల్గుణ మాసం ఎంతో ఉత్తమమైనది.కన్యా రాశి వారు ఫాల్గుణ మాసం లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!