Megastar Chiranjeevi : తన తండ్రితో కలిసి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా...!

Megastar Chiranjeevi : తన తండ్రితో కలిసి నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా...!


మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారు ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా పుట్టారు చిరంజీవి.

తన చదువు పూర్తయ్యాక పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తన సినీ కెరీర్ ని ప్రారంభించాడు చిరంజీవి.తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొన్న చిరంజీవి ప్రస్తుతం కోట్లాదిమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు.


తన ఫ్యామిలీ నుంచి naga babu, pawan kalyan,ram charan,sai dharam tej,allu arjun, vaishnav tej,varun tej, niharika konidela,allu sirish అలా ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు చిరంజీవి.

అయితే కేవలం వీరే కాకుండా చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు కూడా ఒక సినిమాలో నటించారు. వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్ అయిన చిరంజీవి తండ్రి వెంకట్ రావు తన కుమారుడి తో కలిసి ఒక సినిమాలో నటించారు. చిరంజీవికి బ్లాక్ బస్టర్ hit ఇచ్చిన ఆ సినిమాలో మంత్రి క్యారెక్టర్ కోసం దర్శకుడు ఎంతో మందిని ట్రై చేశాడట.

అయితే ఎవరూ కూడా ఆ క్యారెక్టర్ కి సెట్ కాలేదట.దాంతో ఆఖరికి చిరంజీవి మామగారైనా అల్లు రామలింగయ్య గారు ఎవరో ఎందుకు చిరంజీవి తండ్రి ఉన్నారు కదా ఆయనకి ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసి చూద్దామని డైరెక్టర్ కి సలహా ఇచ్చారట.

ఇక స్క్రీన్ టెస్ట్ చేయగా ఆ మంత్రి పాత్రకి చిరంజీవి తండ్రి అద్భుతంగా సెట్ అయ్యాడట. అయితే ఆ సినిమాలో చిరంజీవికి అతని తండ్రికి మధ్య మాత్రం ఎలాంటి సీన్లు లేవు. కానీ తండ్రి కొడుకులు కలిసి ఒకే సినిమాలో నటించారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు 1983లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మంత్రి గారి వియ్యంకుడు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!