Latest Telugu News : ఇంట్లో ఈ వస్తువులు ఎప్పుడూ అయిపోకూడదు....!

Latest Telugu News : ఇంట్లో ఈ వస్తువులు ఎప్పుడూ అయిపోకూడదట...!


ఉప్పు : మనం ఇంట్లో ప్రతినిత్యం వాడే ఉప్పు ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోకూడదని అంటారు . కొన్ని ఉప్పు ప్యాకెట్లను ముందుగానే నిలువ చేసుకుని ఉంచుకోవాలి. ఉప్పు పూర్తిగా అయిపోయినప్పుడు ఇంట్లో ప్రతికూలత పెరిగి వాస్తు దోషం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఉప్పు పూర్తిగా అయిపోయినప్పుడు అది వంటగదిలో పని చేసే మహిళలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.


బియ్యం : వంటగది లో బియ్యం ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోకూడదు. అలా జరిగితే శుక్ర దోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట . ఇంట్లో ఎప్పుడు బియ్యం నిల్వ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.

నూనె : వాస్తు శాస్త్రం ప్రకారం , నూనె శని భగవంతునితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. వంటగది లో నూనె పూర్తిగా అయిపోతే శనిదేవుడు కోపగిస్తాడు. వీలైతే ప్రతి శనివారం నూనెను దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.

పసుపు : పసుపు వంటగదిలో ఉండాల్సిన అతి ముఖ్యమైన వస్తువు. పసుపు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందువల్ల ఎప్పుడూ కూడా పసుపు అయిపోకుండా చూసుకోవాలి. పసుపు అయిపోవడం పిల్లల చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతుందట . అలాగే ఇంట్లో శుభ కార్యాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడు పసుపు నిల్వ ఉండేట్టు చూసుకోవాలి.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Best Dog Bed in India Online at Amazon.in

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse