Latest Telugu News : గుళ్లో దేవుని ఎదురుగా నుంచుని... అస్సలు నమస్కరం చేయకూడదు ఎందుకో తెలుసా...?
Latest Telugu News : గుళ్లో దేవుని ఎదురుగా నుంచుని... అస్సలు నమస్కరం చేయకూడదు ఎందుకో తెలుసా...?
ఏ దేవుని గుడిలోనైనా ఎప్పుడూ కూడా దేవుడి కి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదని చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం ఏ గుడిలోనైనా దేవుడికి ఒక పక్కగా నిలబడి నమస్కారం చేయాలట. ఎప్పుడూ కూడా ఎదురుగా నిలబడకూడదు అలా ఎందుకు చెబుతారో తెలుసా..?
గుడిలో దేవున్ని ప్రాణ ప్రతిష్ట చేసే క్రమంలో ఆ దేవతా విగ్రహం లోకి ఎన్నో శక్తులను ఆహ్వానిస్తారు. ముఖ్యంగా దేవాలయంలో మూల విరాట్ ను వేదమంత్రాల సాక్షిగా ప్రతిష్టిస్తారు. కాబట్టి అన్ని దేవాలయాల్లోనూ అద్వితీయమైన శక్తి ఉంటుంది.
ముఖ్యంగా కాళికామాత ఆలయాలలో, పరమ శివుని ఆలయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆలయాల్లో అద్వితీయమైన మహాశక్తులు ఉంటాయి. అందుచేత దేవత విగ్రహాలకే ఎదురుగా నిలబడితే ఆ శక్తిని మనం అస్సలు తట్టుకోలేము. అందుకనే ఎప్పుడూ కూడా దేవాలయాల్లో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి