Latest Telugu News : పూజలో దీపాలు వెలిగించేటప్పుడు అలా చెయ్యకండి... అస్సలు మంచిది కాదు...!

Latest Telugu News : పూజలో దీపాలు వెలిగించేటప్పుడు అలా చెయ్యకండి...అస్సలు మంచిది కాదు...!


మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ప్రతినిత్యం తప్పకుండా దీపారాధన చేయాలి. ఎందుకంటే దీపానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.అందుకే ఏ శుభ కార్యమైనా దీపాన్ని వెలిగించే ప్రారంభిస్తారు.ఇది ఎంతో పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం.

దీపం వెలిగించకుండా చేసే పూజలు అసంపూర్ణమని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే దీపం వెలిగించేటప్పుడు ప్రతి ఒక్కరు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.అప్పుడే మనకు పూర్తి శుభ ఫలితం లభిస్తుంది.

పూజకి ఉపయోగించే కుందులకు ఎలాంటి పగుళ్లు ఉండకూడదు.ఒకవేళ మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే ఆ ప్రమిదకి ఎలాంటి పగుళ్లు లేకుండా చూసుకోవాలి. ఇక పూజకు వాడే దీపాన్ని ఎప్పుడూ శుభ్రంగా కడిగాకా మాత్రమే ఉపయోగించాలి.

కొంత మంది ఉదయం వెలిగించిన కుందులోనే మళ్లీ సాయంత్రం నూనె పోసి దీపారాధన చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఏ పూటకి ఆ పూట శుభ్రం చేసిన కుందులనే పూజకి వాడాలి. అలాగే పూజకి స్టీల్ కుందులను అస్సలు ఉపయోగించకూడదు.

పూజకు ఉపయోగించే కుందుల్లో తగినంత నూనె పోసి పూజ సంపూర్ణంగా ముగిసే వరకు దీపం వెలిగేటట్టు చూడాలి. అలాగే దూది ని ఉపయోగించి స్వయంగా మనమే తయారు చేసిన వత్తులతో దేవుడికి దీపారాధన చేస్తే పూర్తి ఫలితం మనకి లభిస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!