Latest Telugu News : వివాహానికి ముందు కాబోయే భార్య గురించి ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి...!

Latest Telugu News : వివాహానికి ముందు కాబోయే భార్య గురించి ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి...!


వివాహాన్ని ఏడు జన్మల సంబంధం గా చెప్తారు. పెళ్లి తర్వాత జీవితం ఆనందంగా ఉండాలంటే జీవిత భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోవాలి. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే వివాహానికి ముందు కాబోయే భార్య గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోవాలనీ చాణక్య నీతి చెబుతోంది అవేంటో చూసేద్దాం.

కోపం, చిరాకు ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా అస్సలు ఎంచుకోకూడదు. కోపమూ, అసహనం ఎక్కువగా ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే చాలా చిరాకునూ, కలహాలను కలిగిస్తారు. కాబట్టి ఓపిక, సహనం ఉన్న స్త్రీని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే కష్ట సమయంలో వారు కుటుంబానికి అండగా ఉంటారు.


అబద్ధాలు చెప్పే వారిని జీవిత భాగస్వామిగా అస్సలు ఎంచుకోకూడదు.ఎందుకంటే అబద్ధాలు చెప్పే వారు జీవిత భాగస్వామిగా వస్తే జీవితం ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. తెలివైన, ప్రతిభ కలిగిన స్త్రీని జీవిత భాగస్వామిగా తెచ్చుకుంటే జీవితం సుఖమయం అవుతుంది.

వివాహం ఎప్పుడు కూడా సమానుల మధ్యే ఉండాలి.అందుకే వివాహానికి ముందే జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక,సామాజిక కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి. అంతే కాకుండా   వివాహానికి ముందే మీ జీవిత భాగస్వామికి ఆధ్యాత్మిక కార్యకలాపాల యందు ఆసక్తి ఉందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడిని నమ్మేవారు తమ జీవితాన్ని ఎప్పటికీ తమ కుటుంబానికి అంకితం చేస్తారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!