Latest Telugu News : vastu శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు... వేరే వారితో అస్సలు పంచుకోకూడదు..!
Latest Telugu News : vastu శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు... వేరే వారితో అస్సలు పంచుకోకూడదు..!
ప్రతి చిన్న విషయాన్ని లేదా వస్తువు ని ఇతరులతో పంచుకున్నప్పుడు వచ్చే ఆనందమే వేరు ! చిన్నప్పటి నుంచి మన పెద్దలు కూడా ప్రతి వస్తువుని ఇతరుల తో పంచుకోమని మనకు నేర్పిస్తూ ఉంటారు. అయితే వస్తువుల్ని, విషయాలనీ ఇతరుల తో పంచుకోవడం సంతోషకరమైనప్పటికీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోకూడదట.
పెళ్లి బట్టలు : కొంత మంది వ్యక్తులు కొన్ని శుభకార్యాలు, ఫంక్షన్ల లో ఆకర్షణీయంగా కనిపించడానికి ఇతరుల దుస్తులను అడిగి తీసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి సమయంలో ఏ దుస్తులనైనా పంచుకోవచ్చు కానీ వివాహ దుస్తులను ఇతరులతో పంచుకుంటే మాత్రం భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంటుందట.
మంచం : మన వ్యక్తిగత మంచాన్ని ఇతరులతో ఎప్పుడూ పంచుకోకూడదు.
కుర్చీ : చదువు కోసం లేదా ఆఫీస్ పని చేసుకోవడానికి మనం ఉపయోగించే ప్రత్యేక కుర్చీ ని ఇతరులతో ఎప్పుడూ కూడా పంచుకోకూడదు. ఎందుకంటే ఇతరులు మన ప్రత్యేక కుర్చీలో కూర్చున్నప్పుడు వారి నెగటివ్ ఎనర్జీ మనకు వచ్చే అవకాశం ఉంటుందట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి