Latest Telugu News : March 8 Maha Shivaratri రోజున ఆ మహా శివున్ని ఈ పూలతో పూజించారంటే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది...!
Latest Telugu News : March 8 Maha Shivaratri రోజున ఆ మహా శివున్ని ఈ పూలతో పూజించారంటే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది...!
మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరి ఆ శివుడి ఆశీస్సులు పొందాలంటే ఈ ఏడాది మార్చి 8న వచ్చే మహా శివరాత్రి రోజున ఆ శివుడిని ఈ పూలతో పూజించండి. ఈ ఏడాది march 8 న రాబోయే మహా శివరాత్రి నాడు శివునికి ఈ పూలను సమర్పించడం వలన ఆ పరమ శివుడి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి.
ఉమ్మెత్త పువ్వు : ఆ శివునికి ఇష్టమైన పూలల్లో ఉమ్మెత్త పువ్వు ఒకటి.ఉమ్మెత్త పువ్వులతో మహా శివరాత్రి రోజున ఆ శివున్ని పూజిస్తే వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ మనసులోని కోరిక నెరవేరాలంటే ఆ శివున్ని శివ రాత్రి రోజు ఉమ్మెత్త పూలతో పూజిస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.
తామర పూలు : శివరాత్రి నాడు తామర పూలతో ఆ శివుని పూజిస్తే శివుని యొక్క ఆశీర్వాదాలు మీకు తప్పకుండా లభిస్తాయి.
మల్లె పూలు : ఎన్నో రోజులుగా అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలూ లేకుండా జరిగి పోవాలంటే శివరాత్రి నాడు ఆ శివున్ని మల్లెపూలతో పూజించండి.
మందారం పూలు : మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితం లభించాలంటే మహా శివరాత్రి నాడు ఆ శివున్ని ఎరుపు మరియు తెలుపు రంగు మందారాలతో పూజించాలి.
గులాబీ పూలు : అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడాలంటే శివరాత్రి రోజు ఆ శివున్ని గులాబీ పువ్వులతో పూజించాలి.
తెల్ల జిల్లేడు : చేసిన పాపాలు తొలగిపోవాలంటే మహా శివరాత్రి రోజు తెల్ల జిల్లేడు పూలతో ఆ పరమ శివున్ని పూజించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి