భోజనం చేసిన వెంటనే ఈ పనులను అస్సలు చేయకూడదు...!

భోజనం చేసిన వెంటనే ఈ పనులను అస్సలు చేయకూడదు...!


పండ్లు : భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూడా పళ్ళను తినకూడదు. భోజనం చేసిన వెంటనే  పళ్ళు తింటే కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుచేత పళ్ళని తినాలనిపిస్తే భోజనానికి ఒక గంట ముందు కానీ లేదా భోజనానికి ఒక గంట తర్వాత గాని పండ్లను తినాలి.

స్నానం : భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూడా స్నానం చేయకూడదు. భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే కాళ్ళకూ, చేతులకూ రక్త సరఫరా ఎక్కువై జీర్ణప్రక్రియ మందగిస్తుంది.

నిద్ర : భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ నిద్రపోకూడదు.ఎందుకంటే భోజనం చేసిన వెంటనే నిద్రపోతే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది.

టీ : భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ టీ తాగకూడదు. భోజనం చేశాక టీ తాగడం వలన  ఎక్కువ మొత్తంలో యాసిడ్ రిలీజ్ అయ్యి, ఆహారం జీర్ణమవడం కష్టమవుతుంది.

ధూమపానం : కొంతమందికి భోజనం చేసిన వెంటనే సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది. అయితే భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూడా సిగరెట్ కాల్చకూడదు. ఎందుకంటే భోజనం తరువాత కాల్చే ఒక్క సిగరెట్ పది సిగరెట్లతో సమానం. ఫలితంగా కాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బుల బారిన పడే అవకాశాలు మరింత పెరుగుతాయి. కాబట్టి భోజనం చేసాక ఈ పనులను అస్సలు చేయకండి.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Haemoglobin : రక్త హీనత తో బాధపడేవారు వీటిని ప్రతి రోజు తింటే లీటర్ల కొద్ది రక్తం ఉత్పత్తి అవుతుంది....!

Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!

Jabardast Chammak Chandra Family Photos : జబర్దస్త్ చమ్మక్ చంద్ర ఫ్యామిలీ ఫొటోస్ ని ఎప్పుడైనా మీరు చూశారా..?