Beauty Tips In Telugu For Face And Hair : బియ్యం కడిగిన నీళ్లతో అందం,ఆరోగ్యం..!

Beauty Tips In Telugu For Face And Hair : బియ్యం కడిగిన నీళ్లతో అందం,ఆరోగ్యం..!


ప్రతిరోజు బియ్యం కడిగిన నీటిని మనమందరం వృధాగా పారపోయడమో లేదా మొక్కలు ఉన్న వాళ్లు మొక్కలకి పోయడమో చేస్తూ ఉంటాం. అయితే బియ్యం కడిగిన నీటిని అలా పారబోయకుండా మన జుట్టు మరియు చర్మ సంరక్షణకు ప్రతినిత్యం ఉపయోగించవచ్చు.

బియ్యం కడిగిన నీటిలో విటమిన్ B, C, E, అమైనో ఆసిడ్లు ఉంటాయి. అవన్నీ జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడంలో బియ్యం కడిగిన నీళ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.

కేశ సంరక్షణకు బియ్యం కడిగిన నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీటిని రాత్రంతా అలాగే ఒక గిన్నెలో పోసి ఉంచి మర్నాడు జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. అలా చేయడం వలన మన జుట్టు అందంగా మెరుస్తూ ఉంటుంది.

జుట్టు పొడి బారిపోయి జీవం లేనట్టుగా నిర్జీవంగా  కనిపిస్తూ ఉంటే బియ్యం కడిగిన నీటిని జుట్టుకి బాగా పట్టించాలి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి వారానికి ఒకసారి ఇలా కొన్ని వారాలు పాటు జుట్టు కి బియ్యం కడిగిన నీటిని పట్టిస్తే జుట్టు ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.
ముఖ్యంగా చుండ్రు, దురద లాంటి సమస్యలతో బాధపడేవారు బియ్యం కడిగిన నీటితో వారానికి ఒకసారి జుట్టును శుభ్రం చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉండి చుండ్రు,దురద సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి.

కేవలం జుట్టుకే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా బియ్యం కడిగిన నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. బియ్యం కడిగిన నీటిని ముఖానికి రాసుకొని పావుగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుంటే చర్మం ఎంతగానో మెరుస్తుంది.ముఖం మీద మచ్చలు ఉంటే అవి కూడా క్రమంగా తగ్గిపోతాయి.చర్మం సున్నితంగా మారడమే కాకుండా ఎంతో ప్రకాశవంతం అవుతుంది.




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Best Dog Bed in India Online at Amazon.in

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse