anchor suma - rajeev kanakala : యాంకర్ సుమకి టీవీ షోలు ఎందుకు తగ్గాయో అసలు నిజం చెప్పేసిన రాజీవ్ కనకాల...!

anchor suma - rajeev kanakala : యాంకర్ సుమకి టీవీ షోలు ఎందుకు తగ్గాయో అసలు నిజం చెప్పేసిన రాజీవ్ కనకాల...!


టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న యాంకర్ సుమ నటుడు రాజీవ్ కనకాల భార్య అన్న విషయం తెలిసినదే కదా ! ఒక ప్రముఖ ఛానల్లో దాదాపు 12 సంవత్సరాల పాటు స్టార్ మహిళ షో (star mahila ) చేసి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ నీ, ఫ్యాన్ ఫాలోయింగ్ నీ సంపాదించుకుంది సుమ.

అయితే ఒకప్పుడు ప్రతి ముఖ్యమైన ఈవెంట్లో కనిపిస్తూ ఉండే సుమ ఈ మధ్యకాలంలో అసలు కనిపించట్లేదు. కేవలం సుమ అడ్డా (suma adda ) అనే ప్రోగ్రాంలో మాత్రమే కనిపిస్తోంది. అందుకు కారణం ఏంటో ఇటీవలే ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్ కనకాల. యాంకర్ సుమ వల్లే తన జీవితం బాగా మారిపోయిందని ముఖ్యంగా సుమ ని పెళ్లి చేసుకున్నాక ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్ అయ్యానని చెప్పాడు రాజీవ్ కనకాల.

కేవలం సుమ వల్లే తమ కుటుంబం ఈరోజు మంచి పొజిషన్ లో  ఉందన్నాడు. తన తండ్రి ప్రముఖ నటుడు devadas kanakala చేసిన అప్పులను తాను సుమా కలిసి తీర్చామన్నాడు. ఒకానొక సమయంలో అప్పులు బాగా ఎక్కువయ్యి తన తండ్రి ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి నేడు ఎన్నో ఆస్తులు సంపాదించామంటే అందుకు సుమ పడ్డ కష్టమే కారణం అని చెప్పాడు.

ఎంత పేరు ప్రఖ్యాతలు గడించినా ఎన్ని షోలు చేసినా సుమ నన్ను, పిల్లల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. సాయంత్రం 6 గంటల వరకు కచ్చితంగా ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఆలస్యమైతే తమ ఇద్దరు పిల్లల్ని నేరుగా షూటింగ్ కి తీసుకెళ్లి వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చూసేది.ఇక సుమకి ఈ మధ్య టీవీ షోలు తగ్గిపోవడానికి కారణం కూడా పిల్లలే.

పిల్లల బాధ్యతతో పాటు సొంతంగా తనకున్న యూట్యూబ్ ఛానల్ (youtube channel ) లో సుమ ఎన్నో షోలు చేస్తూ ఉంటుంది. మావి గవర్నమెంట్ ఉద్యోగాలు కావు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు.కాబట్టి పలు షోలతో యూట్యూబ్ ఛానల్ ని డెవలప్ చేసుకుంటున్నామని ఆ ఇంటర్వ్యూలో తమ కుటుంబానికి చెందిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు రాజీవ్ కనకాల.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!