Tips For Kitchen In Telugu : ప్రతీ రోజూ అందరికీ ఉపయోగపడే వంటింటి చిట్కాలు
Tips For Kitchen In Telugu : ప్రతీ రోజూ అందరికీ ఉపయోగపడే వంటింటి చిట్కాలు
ఈ వంటింటి చిట్కాలు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి...అవేంటో ఒకసారి మీరే చూసేయండి.
1. చపాతీలు చేసిన వెంటనే వేడిగా తింటేనే మెత్తగా ఉంటాయి... కాసేపు అవ్వగానే గట్టిగా అయిపోతాయి..అయితే ఎప్పటికీ చపాతీలు మెత్తగా ఉండాలంటే చపాతీ పిండి కలిపేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ పాలు వేశారంటే చల్లారాక కూడా చపాతీలు మెత్తగా దూదిలాగా ఉంటాయి.
2. పొడి కారం నిలువ ఉంచే డబ్బాలో ఒక చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పెట్టకుండా కారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
3. పప్పు ఉడికించేటప్పుడు అందులో కాస్త నూనె కానీ డాల్డా కానీ వేస్తే తొందరగా మెత్తగా ఉడుకుతుంది.
4. ఫ్రిడ్జ్ లో పెట్టిన పన్నీరు ముక్కలు గట్టి పడితే వాటిని ఒక ఐదు నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచితే మెత్తగా అవుతాయి.
5. పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొబ్బరి చిప్ప లోపల కాస్త నిమ్మరసం రాయాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి