HYD : వామ్మో ! ఆవులకి రొట్టెలు పెడితే చంపేస్తారా..?

HYD : వామ్మో ! ఆవులకి రొట్టెలు పెడితే చంపేస్తారా..?


మన హిందూ సంప్రదాయంలో  గోవుని మహాలక్ష్మి లో పూజిస్తారు. అలాగే మన ఇంటి ముందుకు ఏదైనా ఆవు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న ఏదో ఒక ఆహారం ఆవుకి పెట్టి ఆ గోమాతకు నమస్కరిస్తాం. అలా చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భావిస్తాం.అయితే అదే ఉద్దేశంతో గోమాతకు రొట్టె పెట్టినందుకు ఆ వ్యక్తి చావు అంచుల వరకు వెళ్ళాడు. అసలేం జరిగిందో చూద్దాం..!

హైదరాబాదులోని బోయినపల్లి స్టేషన్ పరిధిలో ఉన్న గణేష్ నగర్ కి చెందిన విజయ్ అనే వ్యక్తి ఇంటి ముందుకి శనివారం ఒక ఆవు వచ్చింది. దాంతో విజయ్ తల్లి ఆవుకి రొట్టెను పెట్టింది. ఇంతలోనే వారి ఎదురు ఇంట్లో ఉండే థామస్ అనే వ్యక్తి మా ఇంటి ముందు రొట్టె వేస్తావా అంటూ విజయ్  తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు.

ఇక అది గమనించిన విజయ్ మా అమ్మని ఎందుకు తిడుతున్నావ్ ? అని అడిగే లోపే థామస్ గబగబా తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి విజయ్ కడుపు కింద భాగంలో పొడి చేశాడు. పైగా ఈ రోడ్డు నాది.. ఇంకోసారి ఆవులకు ఇక్కడ ఆహారం పెడితే అందరినీ చంపేస్తానని బెదిరించాడు. ఇక విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. బోయిన్ పల్లి పోలీసులు వచ్చి థామస్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Latest Telugu News : cell phone ని రోజుకి నాలుగు గంటల కంటే ఎక్కువ వాడితే... ప్రాణానికే ప్రమాదమంటున్న నిపుణులు..!