Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : ఆ దానం చేయడం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయట...!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : ఆ దానం చేయడం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయట...!


మనకున్న దాంట్లో కొంత భాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మాలు చేయడం అనేది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. అయితే దానాలు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో అన్నదానం,వస్త్రదానం,జలదానం,గోదానం, కన్యాదానం, సువర్ణ దానం, భూదానం మొదలైనవి అన్ని దానాల్లోకి ఎంతో విశిష్టమైనవి.


ఇక ఏ దానం చేస్తే ఏ యోగం ప్రాప్తిస్తుందో ఇప్పుడు చూద్దాం...
1. అన్నదానం - అన్నదానం చేస్తే రుణ బాధ తగ్గి దరిద్రం పోతుంది.
2. వస్త్ర దానం - వస్త్ర దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది.
3. భూదానం - భూదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి మరియు ఈశ్వరుడి దర్శన ప్రాప్తి కలుగుతుంది.


4.  పెరుగు - పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
5. తేనె  - తేనె దానం చేస్తే పుత్ర సంతానం కలుగుతుందట.
6. ఉసిరికాయ - ఉసిరికాయను దానం చేస్తే ధనప్రాప్తి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.


7. బియ్యం - బియ్యం దానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి.
8. పాలు - పాలను దానం చేస్తే అతి నిద్ర అరికట్ట పడుతుందట.
కాబట్టి వీటిలో మీకు సాధ్యమైనవి అవసరమైన వారికి దానం చేసి శుభ ఫలితాలను పొందండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Health Tips In Telugu : ఈ ఆహార పదార్థాలు తింటే రక్తనాళాలు క్లీన్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ షుగర్, BP మటుమాయం అవుతాయి

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse