Big Boss 7 Telugu Winner Pallavi Prashanth : పరారీలో పల్లవి ప్రశాంత్

Big Boss 7 Telugu Winner Pallavi Prashanth : పరారీలో పల్లవి ప్రశాంత్


బిగ్ బాస్సె 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ సెవెన్ విన్నర్ ని ప్రకటించాక అన్నపూర్ణ స్టేడియం ముందు గేట్ నుంచి బయటకు రావద్దని పల్లవి ప్రశాంత్ కి చెప్పారు పోలీసులు. అయినా వారి మాటలు వినకుండా పల్లవి ప్రశాంత్ బయటికి రావడం వల్ల అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు.

ఇక పల్లవి ప్రశాంత్  బయటికి వచ్చిన సమయంలో అతని అభిమానులు నానా రభస చేసి తెలంగాణ ఆర్టీసీ బస్సులు అద్దాలను అలాగే రన్నర్ అమర్ దీప్ చౌదరి  ( amardeep chowdary ) కారు అద్దాలు,మరికొందరి కారు అద్దాలు పగలగొట్టడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

దాంతో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే విషయమై ప్రశాంత్ లాయర్ హైకోర్టు న్యాయవాది డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ కేసుల భయంతో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలని తాను జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించినట్టు చెప్పాడు.

ఇక తాజాగా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తాను ఎక్కడికి పారిపోలేదని ఇంటి వద్దే ఉన్నానని కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఇంకా మాట్లాడుతూ నా వల్ల ఇబ్బంది జరిగితే నన్ను క్షమించండి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే వేరే వాళ్ళ ఫోన్ ద్వారా ఈ వీడియో పెట్టానని చెప్పాడు.తను ఊర్లోనే ఉన్నానని ఎవరు టెన్షన్ పడొద్దు అని తన అభిమానులను కోరాడు పల్లవి ప్రశాంత్ .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse

Telugu Podupu Kathalu With Answers