Beauty Tips In Telugu For Face Glow : చర్మానికి మంచి నిగారింపు రావాలంటే చలికాలంలో ఇలా చేయండి..!

Beauty Tips In Telugu For Face Glow : చర్మానికి మంచి నిగారింపు రావాలంటే చలికాలంలో ఇలా చేయండి..!


వంటింట్లో రోజూ మనకి అందుబాటులో ఉండే వాటిని ఉపయోగించి చలికాలంలో వచ్చే పొడిబారిన చర్మం , పెదాల పగుళ్లు, శిరోజాల సమస్యలు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి విముక్తిని పొందవచ్చు.
1. వంట సోడా ( baking soda ) : మనం వాడే ఏదైనా ఫేస్ వాష్ లో కొద్దిగా వంట సోడా కలిపి ముఖానికి రాసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకుని గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. వంటసోడా మంచి క్లెన్సర్ కావడం వలన వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం బాగా మెరుస్తుంది.

2. కాఫీ పొడి ( coffee powder ) : ఒక రెండు చెంచాల కాఫీ పొడి ( Bru ) లో అర చెంచా పసుపు, ఒక చెంచాడు పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఒక అరగంట తర్వాత కాస్త గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చలికాలంలో చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.

3. కొబ్బరి నూనె ( coconut oil ):  సాధారణంగా చలికి చర్మమంతా పొడి పారిపోయినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు స్నానానికి ముందు కొబ్బరి నూనెను శరీరం అంతటికీ బాగా పట్టించి కాసేపు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ప్రతిరోజు  ఇలా చేస్తే చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది.

4. బీట్ రూట్ ( beet root )  : బీట్ రూట్ ని  చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు ఆ బీట్రూట్ పేస్టులో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి ఐదు నిమిషాల పాటు ముఖం మీద బాగా మర్దన చేయాలి. కాసేపు ఆరనిచ్చి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం ఎంతో కాంతి వంతంగా మెరిసిపోతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!