Karthika Pournami 2023 : కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి..? నవంబర్ 26 లేదా నవంబర్ 27 ?
Karthika Pournami 2023 : కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి..? నవంబర్ 26 లేదా నవంబర్ 27 ?
కార్తీకమాసం మొత్తం అంతా కూడా ఎంతో పవిత్రమైందని పురాణాల్లో చెప్పబడింది ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైనది కార్తీక పౌర్ణమి రోజున మన శక్తి కలది ఏ చిన్న పూజ చేసినా మనకి 100 రెట్ల పుణ్యఫలితం వస్తుందని పురాణాల్లో చెప్పబడింది.
కార్తీక పౌర్ణమి రోజున మనము చేసే పూజ అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని మనకు ఇస్తుందట. ఇక కార్తీక పౌర్ణమి ఈ ఏడాది ఏ రోజు జరుపుకోవాలో తెలీక చాలామంది ఆలోచనలో పడిపోతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది వచ్చిన ప్రతి పండుగ తగులు మిగులుగా వస్తోంది.
అంటే ఈ ఏడాది వచ్చిన ప్రతి పండుగ ముందు రోజు మధ్యాహ్నం మొదలై మరుసటి రోజు మధ్యాహ్నం ముగుస్తోంది. ఇక ఈ ఏడాది ప్రతి తెలుగు క్యాలెండర్ లోను నవంబర్ 27 సోమవారం నాడు కార్తీక పౌర్ణమిని చూపిస్తోంది. అయితే మనం ఏ పండగ అయినా తిధి ని బట్టి చేసుకుంటాం కాబట్టి పౌర్ణమి ఘడియలను బట్టి కార్తీక పౌర్ణమి పూజ చేసుకోవాలి.
ఇక ఈ ఏడాది ఆదివారం నవంబర్ 26న మధ్యాహ్నం 3:12 నిమిషాలకు పౌర్ణమి ఘడియలు ప్రారంభమై మరుసటి రోజు అంటే సోమవారం నవంబర్ 27న మధ్యాహ్నం 2:10 నిమిషాల వరకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి.
అయితే కార్తీక పౌర్ణమి ముఖ్యంగా చంద్రోదయం అయిన సమయంలో చేసుకుంటాం కాబట్టి నవంబర్ 26 ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి పూజ చేసుకోవడం ఎంతో శ్రేష్టం. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ సాయంత్రం పౌర్ణమి పూజ చేసుకొని తులసి కోట ముందర ముగ్గు వేసుకుని 365 వొత్తులను వెలిగించుకోవాలి.
ఇక అలా ఉపవాసం ఉండలేని వారు సోమవారం అంటే నవంబర్ 27న కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి విశేషంగా ఉండడం వలన ఉదయం 3:30 గంటల నుంచి 5:30 గంటల లోపు పూజను ముగించుకుని 365 వత్తులను వెలిగించుకోవడం ఎంతో శ్రేష్టం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి