Karthika Masam - కార్తీక మాసంలో ఆ సమయంలో దీపం వెలిగిస్తే.. కష్టాలు తప్పవు...!

Karthika Masam - కార్తీక మాసంలో ఆ సమయంలో దీపం వెలిగిస్తే.. కష్టాలు తప్పవు...!

కార్తీక మాసంలో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే దీపం వెలిగించాలి.ఏ సమయంలో పడితే ఆ సమయంలో దీపాన్ని వెలిగిస్తే కష్టాలు తెచ్చుకున్నట్టే అని పెద్దల అభిప్రాయం. ఆ పరమ శివుడిని భోళా శంకరుడని అంటారు,అంటే శివుడికి మనము నువ్వుల దీపాన్ని వెలిగించినా,బిల్వదళాన్ని సమర్పించినా లేదా ఉత్తి నీటితో అభిషేకించినా ఎంతో సంతృప్తుడై మన కోరికలు తీరుస్తాడు.
కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేయాలి. ఎవరైతే ఇంట్లో రెండు పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంటికి తప్పకుండా శ్రీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సూర్యోదయం కంటే ముందు నుంచి అలాగే ఉదయం 10 గంటల లోపే పూజ చేసి దీపాన్ని వెలిగించాలి.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దీపారాధన చేయడం సరైన పద్ధతి కాదు. ఇక సాయంత్రం పూట ఇంటిని శుభ్రపరుచుకుని 5 గంటల నుండి 7 గంటల లోపే దీపారాధన చేయాలి.ఇలా చేస్తే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని పురాణాల్లో చెప్పబడింది.
ఇక ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట ముందు కానీ లేదా ఏదైనా దేవాలయంలో కానీ 365 వత్తులు వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు, పుణ్యతీర్ధాలు కొలువై ఉంటాయి. కాబట్టి కేవలం కార్తీక పౌర్ణమి రోజే  కాకుండా ప్రతిరోజు తులసి కోటముందు దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
కార్తీకమాసంలో శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి కనకాంబరం పూలతో లక్ష్మీదేవికి కనక పూజ చేస్తే స్త్రీలు దీర్ఘ సుమంగళి గా ఉంటారని పురాణాల్లో చెప్పబడింది. అలాగే కార్తీకమాసంలో నువ్వులను దానం చేయడం వలన చేసిన పాపాలన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది.
ఇక ఉసిరి చెట్టు ని విష్ణు స్వరూపంగా భావిస్తారు. కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేసి ఉసిరి దీపాలను వెలిగిస్తే ఆ శ్రీమహావిష్ణువు యొక్క కరుణాకటాక్షులకు పాత్రులవుతాం.అలాగే కార్తీకమాసంలో ఏ ఇంటి ముందు అయితే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట్లోకి శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని భావిస్తారు.అందుచేత కార్తీకమాసంలో ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు దీపాలను పెడితే ఆ లక్ష్మీదేవిని మన గృహానికి ఆహ్వానించినట్లే అవుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!