Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఏ సమయంలో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో తెలుసా...?

Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఏ సమయంలో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో తెలుసా...?

2023 నవంబర్ 14 నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. ఇక అన్ని మాసాలలో కార్తీక మాసం అత్యుత్తమ మాసంగా చెప్పబడింది. కార్తీకమాసంలో అన్ని పండుగలే ! బలి పాడ్యమి, భగిని హస్తభోజనం, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి,క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు.

ఇక కార్తీకమాసంలో 30 రోజులు ఎవరైతే నది స్నానం చేస్తారో వారందరికీ ఆ శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.
కార్తీకమాసంలో స్నానం చేసేవారు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో శివ శివా లేదా ఓం నమశ్శివాయ అనుకుంటూ స్నానం చేయాలి. 
ఇక కార్తీకమాసంలో స్నానం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుని తలుచుకుని నన్ను అనుగ్రహించు గాక అని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి.

కార్తీకమాసంలో నదులు, కాలువలు,చెరువులు, బావులు మొదలైన వాటి దగ్గర స్నానం చేయాలి. ఇవి ఏవి దగ్గరగా లేనివారు ఒక బకెట్లో నీటిని నింపి రాత్రంతా వెన్నెలలో ఉంచి మర్నాడు ఉదయాన్నే స్నానం చేయాలి ఇలా చేస్తే నది స్నానం చేసినంత పుణ్యం వస్తుందట!

అలాగే కార్తీక స్నానం చేసేటప్పుడు :-

తులారాశి గతే సూర్య గంగా త్రైలోకపావని
సర్వతా ద్రవరూపేణ ససంపూర్ణే భవతే తధా !

అనే శ్లోకాన్ని చెప్పుకుని స్నానం చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందట!

కార్తీక స్నానాన్ని సాధారణంగా తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఐదున్నర గంటల మధ్య తులారాశి సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కార్తీక స్నానం చేయడం ఎంతో ఉత్తమమైనది. కార్తీక స్నానాన్ని చల్లటి 
నీటితోనే చేయాలి.వేడి నీటితో చేయకూడదు. అయితే ఆరోగ్యం సహకరించని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు.

అలాగే కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీకమాసంలో వచ్చే అన్ని సోమవారాలలో స్నానం చేయాలి. ఎందుకంటే కార్తీక సోమవారాలు ఎంతో ప్రధానమైనవి,
కాబట్టి కనీసం కార్తీక సోమవారాలు స్నానం చేసినా నెలరోజుల కార్తీక స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది.

ఇక కార్తీకమాసంలో 30 రోజులు స్నానం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు,అమావాస్య రోజు స్నానం చేసినా కూడా  నెలరోజుల  కార్తీక స్నానం చేసినంత ఫలితంతో పాటు కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుందట!

అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు ఉండి కార్తీకమాసంలో స్నానం చేయడం కుదరని 
వారు కనీసం ప్రతిరోజు కార్తీక పురాణం 
విన్నా కూడా వారికి ఉన్న సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది!



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Rashmika Mandanna - Venu Swamy : వేణు స్వామి చేత మళ్లీ పూజలు చేయించిన రష్మిక..!

Best Dog Bed in India Online at Amazon.in

Latest designer Sarees Online For Women - Latest Georgette Hot Fixing Swaroski Stone Work Designer Saree with Fancy Blouse