Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!
Home Made Fertilizer For Rose Plants : ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే....మీ గులాబీ చెట్టు గుత్తులు గుత్తులుగా పూలను ఇస్తుంది...!
గులాబీ పూలు అంటే ఇష్టం పడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఇక ఇంట్లోనే అతి సులువుగా తయారు చేసుకోగలిగే ఫర్టిలైజర్ ని కనుక గులాబీ మొక్కలకి మీరు ఇచ్చారంటే మీ ఇంట్లో గులాబీ పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అసలు గులాబీ మొక్కలు బాగా ఎదగాలంటే ముందుగా కొన్ని చిట్కాలను పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
గులాబీ మొక్కల మొదట్లో కొంచెం ఎండినట్టుగా కనిపించాకే మొక్కలకి నీళ్లు పొయ్యాలి. అతిగా నీటిని పోయకూడదు. అలాగే గులాబీ మొక్కని ఉంచిన కుండీలో ఎక్కువైన నీరు బయటకు వెళ్ళిపోయేలా కుండీ కి రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. ఇక గులాబీ మొక్కని పెట్టే కుండీలోని మట్టిలో కనీసం ఒక వంతు ఇసుకను కలపాలి.
అలాగే 15 రోజులకు ఒకసారి DAP ఎరువుని తప్పకుండా గులాబీ మొక్కలకు ఇవ్వాలి. అంతే కాదండి గులాబీ మొక్కలకి బాగా ఎండ తగిలేలా చూడాలి గులాబీ మొక్కలకి ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటల పాటు ఎండ తగిలేలా చూడాలి.
అప్పుడే గులాబీ మొక్కలకి గుత్తులు గుత్తులుగా గులాబీ పూలు పూస్తాయి.
ఇక గులాబీ పూలు గుత్తులు గుత్తులుగా పుయ్యాలంటే ఇంట్లోనే ఫర్టిలైజర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఆరు అరటి తొక్కలను బాగా నలిపి లేదా బాగా చిన్న ముక్కలుగా కానీ చేసి ఆ నీళ్లలో వెయ్యాలి. ఇప్పుడు అరటి తొక్కలను వేసిన ఆ నీళ్ల గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరగనివ్వాలి.
అలా నీరు మరుగుతున్నప్పుడే దాంట్లో ఒక చెంచాడు ఏదైనా ఒక కాఫీ పౌడర్ ని అలాగే ఒక చెంచాడు టీ పౌడర్ ని వేసి మరగనివ్వాలి. అలా ఒక పది నిమిషాల పాటు నీరు బాగా మరిగాక స్టవ్ కట్టేసి ఒక గంట పాటు ఆ నీటిని చల్లారనివ్వాలి. నీరు బాగా చల్లారాక ఒక కప్పు పుల్లటి పెరుగును అందులో వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఆ నీటిని వడబోయాలి. వడపోసిన నీటిలో ఐదు రెట్ల నీరును పోసి బాగా కలిపి అలా తయారైన నీటిని గులాబీ మొక్కల మొదట్లో పోయాలి. అంతే 15 రోజులకు ఒకసారి కనుక ఇలా చేశారంటే మీ గులాబీ మొక్కలకి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి అన్ని ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి.
ఇక వడ పొయ్యగా వచ్చిన అరటిపండు తొక్కలని పళ్ళముక్కల మొదట్లో కాస్త మట్టిని తవ్వి ఆరటిపండు తొక్కలను వేసి మళ్లీ మట్టితో కప్పేస్తే పళ్ళ మొక్కలకు కూడా మంచి ఎరువును అందించినట్టుగా అవుతుంది. తప్పకుండా ప్రయత్నించి చూడండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి