Health Tips In Telugu : బరువు పెరగకుండా ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే...ఇలా చెయ్యండి...!
Health Tips In Telugu : బరువు పెరగకుండా ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే...ఇలా చెయ్యండి...!
నిత్యం మనం కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా ఎప్పుడు ఒకేలా ఉండేలా జాగ్రత్త పడచ్చు. ఇక్కడ చెప్పిన ఈ చిట్కాలను కనుక రోజు పాటించారంటే మీ బరువు అస్సలు పెరగదు.
1.ఆహారంలో చక్కెరను చాలా తక్కువగా వాడాలి. ఎందుకంటే చక్కెర ఎక్కువగా వాడినప్పుడు అది మన శరీర బరువుని పెంచుతుంది.
2. అలాగే సమోసా, చిప్స్, నూడుల్స్, వేపుళ్ళు, బర్గర్లు, పిజ్జాలు, బజ్జీలు, వడలు మొదలైన ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాటిలో ఉండే అధిక స్థాయి సోడియం,చక్కర వంటివి మన శరీర బరువును విపరీతంగా పెంచేస్తాయి.
3. ఇక మరీ ముఖ్యంగా రాత్రి 8 గంటల లోపు భోజనాన్ని ముగించి ఆ తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే రాత్రి 8 గంటల లోపల భోజనం ముగించగలిగితే ఆహారం రెండు గంటల్లో జీర్ణం అయిపోతుంది.
ఇక రాత్రి 8 గంటల తర్వాత మరీ ఆకలిగా అనిపిస్తే కాసిన పండ్ల ముక్కలో, కూరగాయ ముక్కలో తినాలి.
4. అలాగే ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీటిని తాగాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి