Diwali 2023 Date : దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలి ..? లక్ష్మీ పూజ ఏ సమయంలో జరుపుకోవాలి ..?
Diwali 2023 Date : దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలి ..? లక్ష్మీ పూజ ఏ సమయంలో జరుపుకోవాలి ..?
చెడుపై మంచి విజయానికి సంకేతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ దీపావళి. ఈ ఏడాదిలో పండుగ తిధులు రెండేసి రోజులు వస్తూ ఉండడంతో గత కొంతకాలంగా మన
పండుగలు జరుపుకునే విషయంలో
గందరగోళం ఏర్పడుతోందనే చెప్పాలి.
శాస్త్రాల ప్రకారం ప్రతి ఏడూ కార్తీక మాసంలో ఆశ్వీయుజ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. కానీ అమావాస్య తిధి ఈసారి రెండు రోజులు రావడంతో ఏ రోజు దీపావళి పండుగ జరుపుకోవాలో తెలియక ప్రజల్లో అయోమయం ఏర్పడిందని చెప్పాలి.
దీపావళి అంటే అమావాస్య చీకట్లను పోగొట్టి వెలుగుని పంచే పండుగ కాబట్టి దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ పూజ చేసి దీపాలను వెలిగిస్తారు.కాబట్టి అమావాస్య గడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఆదివారం నవంబర్ 12, 2023 న మధ్యాహ్నం 2.44 గంటలకు అమావాస్య తీధి ప్రారంభమై నవంబర్ 13, 2023 మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తోంది. లక్ష్మీ పూజ సాయంత్రం చేసుకుంటాం కాబట్టి నవంబర్ 12 న సాయంత్రం లక్ష్మీ పూజను చేసుకోవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి