గోరింటాకు మొక్కని కనుక ఇంట్లో పెంచారంటే ఇంట్లోని వారికంతా అశుభం...అశాంతి...అనారోగ్యమే ..!
గోరింటాకు మొక్కని కనుక ఇంట్లో పెంచారంటే ఇంట్లోని వారికంతా అశుభం... అశాంతి...అనారోగ్యమే ..!
సాధారణంగా మొక్కలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పాలి. ఎవరికి ఉన్న స్థలాన్ని బట్టి వారు ఏవో కొన్ని పూలు,పండ్ల మొక్కలు పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక ఆడవారైతే పూలు, పళ్ళ మొక్కలతో పాటు గోరింటాకు మొక్కను కూడా తప్పకుండా పెంచుకోవడానికి ఇష్టపడతారు.
అయితే గోరింటాకు మొక్కని ఇంట్లో నాటడం ఎంతో అరిష్టమని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు. గోరింటాకును పెట్టుకోవడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. కానీ గోరింటాకు చెట్టుని ఇంట్లో నాటడం మాత్రం ఎంతో ఆశుభమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే గోరింటాకు మొక్కలకు ప్రతికూల శక్తులు ఉంటాయట. కాబట్టి మనం గోరింటాకు మొక్కని ఇంట్లో కనుక నాటితే అది ఇంట్లోనే వారి మనశ్శాంతి, ఆనందాలపై చెడు ప్రభావం చూపి ఇల్లంతా నెగటివ్ ఎనర్జీతో నిండిపోతుందట. గోరింటాకు చెట్టుని నాటిన వారి ఇంట్లో అభివృద్ధి నిలిచిపోతోందట. అలాగే గోరింటాకు చెట్టుని నాటిన ఇంట్లోని వారి మధ్య ఎప్పుడూ తగాదాలు, విభేదాలు ఏర్పడుతూ ఉంటాయట.
గోరింటాకు చెట్టు ఇంట్లోని వారి మనశ్శాంతిని దూరం చేయడమే కాకుండా ఆ ఇంట్లోని వారందరికీ ఎప్పుడు ఏవో ఒక ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతాయట. గోరింటాకు చెట్టుని నాటిన ఇంట్లోని వారందరూ కూడా నిరంతరం అనారోగ్యం పాలవుతూ ఉంటారట. కాబట్టి ఎప్పుడూ కూడా గోరింటాకు చెట్టుని మీ ఇంటి పెరట్లో నాటకండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి