తెలంగాణ రాష్ట్రంలోని ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులంతా .... దీపావళిని స్మశానంలో జరుపుకుంటారట ...!

తెలంగాణ రాష్ట్రంలోని ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులంతా .... దీపావళిని స్మశానంలో జరుపుకుంటారట ...!


సాధారణంగా దీపావళిని ఎవరైనా తమ కుటుంబ సభ్యులతోనూ, బంధుమిత్రులతోను జరుపుకుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఊర్లోని ప్రజలు మాత్రం దీపావళి పండుగను ఏటా తమ ఊర్లోని స్మశాన వాటికలో జరుపుకుంటూ ఉంటారు. వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది మాత్రం నిజం.

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న కార్ఖానా గడ్డ అనే ఊర్లోని ప్రజలు గత 60 సంవత్సరాలుగా దీపావళిని తమ ఊర్లోని స్మశాన వాటికలో ఉన్న తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద ప్రతి ఏటా దీపావళిని జరుపుకుంటారు. ఉద్యోగాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన వారందరూ కూడా దీపావళి పండుగ రోజున తప్పకుండా తమ ఊరికి వచ్చి తమ సభ్యులతో కలిసి స్మశానంలో దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటారు.

దీపావళి పండగ రోజు ఆ గ్రామంలోని వారంతా కొత్త బట్టలను ధరించి పిల్లలతో  పాటు సాయంత్రం 6 గంటలకు స్మశానానికి వెళ్లి అక్కడ ఉన్న సమాధులను శుభ్రం చేసి ఆ సమాధుల వద్ద దీపాలను వెలిగించి చనిపోయిన వారికి ఇష్టమైన పిండివంటలను వండి వాటిని వారికి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత అక్కడే తమ పిల్ల పాపలతో కలిసి టపాకాయలను కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు.

దీపావళి రోజు రాత్రి అంతా స్మశానం లోని ఆ సమాధుల వద్దే వారు ఉంటారు.దీపావళి పండుగ రోజున అలా చేయడం వలన చనిపోయిన వారి ఆత్మీయుల ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆ గ్రామస్తుల  అభిప్రాయం. గత 60 సంవత్సరాలగా ఆ ఊర్లోని గ్రామస్తులు అంతా దీపావళి పండుగను ఇలాగే స్మశానంలో జరుపుకుంటున్నారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Latest Telugu News : 12 ఏళ్ల తర్వాత ఏర్పడే గజలక్ష్మి రాజయోగం వలన మార్చ్ లో ఈ రాశుల వారికి అద్భుత యోగం రానుంది..!

Dharma Sandehalu - Talapatra Nidhi In Telugu : పెద్దలు చెప్పిన మన సాంప్రదాయాలు..!